అన్వేషించండి

Tirumala News: ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయానికి ఆకాశగంగ నుండి పవిత్ర జలాలు, కారణం ఇదే

Tirumala Latest News: తిరుమలలో దాదాపు రెండు కిలో మీటర్ల మేర శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి దాదాపుగా 30 గంటల సమయం పడుతుంది.

Tirumala News: పెరటాసి మాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. గురువారం 06-10-22 రోజున 72,195 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 41,071 మంది తలనీలాలు సమర్పించగా, 2.17 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండి పోవడంతో దాదాపు రెండు కిలో మీటర్ల మేర శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి దాదాపుగా 30 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు ఐదు గంటల సమయం పడుతుంది. 
శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం ఆకాశ జలాలతో శ్రీ వేంకటేశ్వరుడికి అభిషేక సేవను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.‌ అటుతరువాత  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 

రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం
సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు. 
సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు.

తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు. ఇక శుక్ర,శని,ఆదివారల్లో సిపార్సు లేఖలపై అనుమతించే బ్రేక్ దర్శనాలను టీటీడీ‌ రద్దు చేసింది. సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనంను దగ్గర చేసేందుకు టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. క్యూలైన్స్ లో వేచి ఉన్న భక్తులు ఒపికగా స్వామి వారి దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌఖర్యం కలుగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget