News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tirumala Updates: 22 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు, తిరుమల దర్శన సమయం ఎంతంటే - శనివారం పూజల విశిష్టత ఇదీ

శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలుస్తారు. తొలుత ఆలయ ద్వారం తెరిచిన అర్చకులు, వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి తొలి దర్శనం చేసుకుంటారు.

FOLLOW US: 
Share:

Tirumala News: తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. వారంతరాలు కావడంతో ఏడుకొండలకు భక్తులు‌ పోటెత్తారు.. సప్రగిరీసుడు, శేషాద్రి నిలయుడైన శ్రీనివాసుడి దివ్యధామంలో తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో‌ మారుమ్రోగుతుంది.. శుక్రవారం 05-08-2022 రోజున 65,939 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 32,894 మంది తలనీలాలు సమర్పించగా, రూ.3.77 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లల్లో సర్వదర్శనం భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనంకు దాదాపుగా 12 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.

శనివారం నాటి పూజలు, కార్యక్రమాలు ఇవీ..
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలుస్తారు. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు.. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు.. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు.. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు..

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు.. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు.. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు.. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు.. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది.. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు.. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు.. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు..

శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఒంజల్ సేవను నిర్వహిస్తారు.. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు.. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు.. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు.. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 06 Aug 2022 10:45 AM (IST) Tags: TTD News piligrims rush in Tirumala Tirumala Tirupati Latest News TTD Darshan details Pooja in tirumala

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

Breaking News Live Telugu Updates: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగిస్తున్న టీడీపీ శ్రేణులు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

AP Politics: జగన్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, ఈరోజు జనసైనికులు సైతం మోత మోగించాలి - నాదెండ్ల పిలుపు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

Top Headlines Today: చంద్రబాబు తప్పు చేయరంటున్న రవిబాబు- తెలంగాణలో బేరాల్లేవమ్మా అంటున్న కాంగ్రెస్- నేటి టాప్ న్యూస్

Top Headlines Today: చంద్రబాబు తప్పు చేయరంటున్న రవిబాబు- తెలంగాణలో బేరాల్లేవమ్మా అంటున్న కాంగ్రెస్- నేటి టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా