అన్వేషించండి

Tirumala: శ్రీవారి ఆలయంలో భక్తుల నిరసన.. టీటీడీ అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. ఏం జరిగిందంటే !

ఆన్లైన్ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్‌లైన్‌లోనే సర్వదర్శనం టిక్కెట్లు, తిరుమల-తిరుపతి స్థానికులకు మాత్రం టీటీడీ అధికారులు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు.

Devotees Protest at Tirupati Balaji Temple: కలియుగ ప్రత్యక్ష దైవం చిత్తూరు జిల్లాలోని తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరుడిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వసిస్తారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) భక్తులను పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తోంది. ఆన్లైన్ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్‌లైన్‌లోనే సర్వదర్శనం టిక్కెట్లు, తిరుమల-తిరుపతి స్థానికులకు మాత్రం టీటీడీ అధికారులు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. 

శ్రీవారి వైకుంఠ ద్వార (ఉత్తర ద్వారం) దర్శనం చేసుకొనేందుకు ఎంతో భక్తి భావంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఎంతో మెరుగైన ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ గత ఏడాదితో పోల్చితే ఏర్పాట్లు అసలు బాగాలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామన్న టీటీడీ.. సామాన్య భక్తుల ఏర్పాట్లు గాల్లో వదిలేసి కేవలం వీఐపీల సేవలకు పరిమితం అయిందని భక్తులు వాపోతున్నారు. ఇక కొందరు భక్తులు టీటీడీ అధికారులపై తీవ్రంగా మండి‌ పడితున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కంపార్ట్మెంట్లో కూర్చో బెట్టి రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి దర్శనానికి వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు.

Koo App
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకొనేందుకు ఎంతో భక్తి భావంతో వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఎంతో మెరుగైన ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ గత ఏడాదితో పోల్చితే ఏర్పాట్లు అసలు బాగాలేదని, వీఐపీల సేవలో టీటీడీ సిబ్బంది తరిస్తోందంటూ భక్తులు అసహనం వ్యక్తం చేశారు. #Tirumala #Tirupati...🌹🙏🌹 #VaikuntaEkadasi #TTD https://telugu.abplive.com/andhra-pradesh/tirupati/tirumala-devotees-protest-at-tirupati-balaji-temple-over-facilities-by-ttd-officials-18261 - Shankar (@guest_QJG52) 14 Jan 2022

Tirumala: శ్రీవారి ఆలయంలో భక్తుల నిరసన.. టీటీడీ అధికారులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. ఏం జరిగిందంటే !

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోకుండా అధికారుల తీరుతో బయటకు వెళ్తున్న భక్తులను టీటీడీ సిబ్బంది సర్ది చెప్పే పరిస్థితి గురువారం తలెత్తింది. భక్తులకు ఎలాగోలా సర్దిచెప్పి టీటీడీ సిబ్బంది వారిని స్వామి వారి దర్శనానికి పంపారు. అయితే శ్రీవారి దర్శనంతరం ఆలయం బయటకు వచ్చి భక్తులు ఒక్కసారిగా టీటీడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగ్గారు. 

వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ సిబ్బంది శ్రీవారి భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా భక్తులు వినిపించుకోక పోవడంతో‌ రంగంలోకి పోలీసులు రంగంలోకి దిగారు. తమ మాటను సైతం భక్తులు లెక్క చేయకపోవడంతో భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తూ వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. టీటీడీ అధికారులు, పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెప్పిన టీటీడీ.. వీఐపీలు, వీవీఐపీల సేవలో తరిస్తూ, సామాన్య భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించారని భక్తులు ఆరోపించారు.

Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి

Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! నేడు ఎగబాకిన పసిడి ధర.. అతి భారీగా పెరిగిన వెండి రేటు.. ఇవాళ ఇలా..

Also Read: Weather Updates: ఎల్లో అలర్ట్.. ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Jeedimetla Fire Accident Today: జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
జీడిమెట్ల అగ్ని ప్రమాదంలో ఇంకా అదుపులోకి రాని మంటలు- భయాందోళనలో స్థానికులు
Ram Gopal Varma Video: నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
నాకు భయమా! పోలీసుల నోటీసులపై ఆర్జీవీ సంచలన వీడియో విడుదల
Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌- కేంద్రమంత్రిగా ఏక్‌నాథ్ షిండే!
Lucky Bhaskar OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి లక్కీ భాస్కర్... 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
PAN Card: పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో
పాన్ 2.0 ప్రాజెక్ట్‌ కింద కొత్త పాన్‌ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో
Embed widget