బెంగళూరు- తిరుపతి హైవేపై దారుణం- లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి
తిరుపతి బెంగుళూరు హైవేపై ఏనుగులు రోడ్డు దాటతున్న టైమ్ఏ లో ఈ ప్రమాదం జరిగింది. మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి.
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఏనుగుల గుంపు ప్రమాదంలో పడింది. ఈ దుర్ఘటనలో మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి.
తిరుపతి బెంగుళూరు హైవేపై రోడ్డు దాటతున్న టైమ్ఏ లో ఈ ప్రమాదం జరిగింది..రోడ్డు దాటుతుండగా ఏనుగుల గుంపును ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో మూడు ఏనుగులు మృతి చెందాయి.
ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీ ఢీకొనడంతో ఏనుగులు రోడ్డుకు అవతల ఎగిరి పడ్డాయి. ప్రమాదంలో లారీ కూడా దెబ్బ తిన్నది. లారీ తీసుకు వెళుతున్న కూరగాయలు కింద పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీని విడిచి పెట్టి డ్రైవర్ పరారయ్యాడు.
ఈ మధ్య కాలంలో ఏనుగులు తరచూ జనావాసాల్లోకి ఫలితంగా అవి ప్రమాద బారిన పడటమో లేకంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే చేస్తున్నాయి. కొన్ని సార్లు పంటలను కూడా నాశనమం చేస్తున్నాయి.
నీళ్ల కోసం ఊరిలోకి ఏనుగులు
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పూజరిగూడ గ్రామంలో ఏనుగులు హల్చల్ చేసాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో తాగునీటి కోసం గజరాజులు గ్రామంలోకి చొరబడుతున్నాయి. ఇళ్ల ముందు డ్రమ్ముల్లో, బిందెల్లో నిల్వ చేసిన నీటిని తాగేస్తున్నాయి. అడవుల్లో సంచరించాల్సిన ఏనుగులు ఇప్పుడు గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మే నెలలో విద్యుత్ షాక్‌తో ఏనుగులు మృతి
మేలో పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.
ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.