పుంగనూరు ఆవులను పెంచుకుంటున్న మోడీ, ఆ ఆవు నెయ్యి కిలో 50 వేలా ? ఎందుకంత స్పెషాలిటీ ?
మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...ఆసక్తికర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొన్ని క్షణాల్లో మోడీ షేర్ చేసిన ఫోటోలు వైరలయ్యాయి.
Modi Punganur Cows : మకర సంక్రాంతి (Makar Sankranthi) సందర్భంగా ప్రధాన మంత్రి (Pm) నరేంద్ర మోడీ (Narendra Modi)...ఆసక్తికర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొన్ని క్షణాల్లో మోడీ షేర్ చేసిన ఫోటోలు వైరలయ్యాయి. ఆ ఫోటోల గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. ప్రధాని మోడీ ముద్దు చేస్తున్న ఆవులేంటి ? వాటి ప్రత్యేకతలు ఏంటి ? అంత చిన్నగా ఆవులు ఎందుకు ఉన్నాయి అన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రధాని మోడీ పుంగనూరు ఆవుల(Punganur Cows)ను పెంచుకుంటున్నారు. వాటిని ఆప్యాయంగా హత్తుకుంటూ.. ప్రేమగా గడ్డి తినిపిస్తున్న ఫోటోలను ట్వీట్ చేశారు.
2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల ఎత్తు
ప్రధాన మంత్రి మోడీ షేర్ చేసిన ఫోటోల్లో కనిపిస్తున్నది చిత్తూరు జిల్లాలోని పుంగనూరు జాతికి చెందిన ఆవులు. ఎందుకంటే పొట్టిగా, ముద్దుగా ఉంటాయి. పుంగనూరు ఆవులు మామూలు ఆవు దూడల సైజులో ఉంటాయి. పుంగనూరు జాతికి చెందిన ఆవులు చాలా అరుదైనవి. సైజులో చిన్నగా ఉండే ఇవి పశువుల జాతుల్లో ప్రత్యేక రకమైన జాతి. కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాయి. ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. వీటిని మొదటిసారి చూసిన వారు మాత్రం అవి ఆవులా, దూడలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ ఉంటుంది. ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి.
ఒక్కో ఆవు 2 లక్షల నుంచి 25 లక్షల ధర
ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న ఈ పుంగనూరు జాతి ఆవులు.. మిషన్ పుంగనూరు ప్రాజెక్టుతో భారీగా పెరిగాయి. తిరుమల ఆలయంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రముఖ దేవాలయాల్లో క్షీరాభిషేకం కోసం పుంగనూరు ఆవు పాలనే ఉపయోగిస్తారు. ఈ ఆవు పాలలో బంగారం రసాయన నామమైన Au అనే మూలకం ఉంటుంది. పుంగనూరు ఆవు పాలల్లో సాధారణ రకం ఆవుల కంటే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. పుంగనూరు ఆవుల్లో... ఒక్కో ఆవు ధర రూ. 2 లక్ష నుంచి రూ.25లక్షల వరకు విలువ చేస్తుంది.
లీటర్ నెయ్యి 50వేలు
పుంగనూరు ఆవు ప్రస్తుతం ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా లింగంపట్టి గ్రామంలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉన్న గోశాలలో సంరక్షించబడుతోంది. ఆవు ఎంత చిన్నదైనప్పటికీ...దాని ధర మాత్రం లక్షల్లోనే. ప్రతి రోజు 3 నుంచి 5 లీటర్ల పాలను మాత్రమే ఇస్తాయి. పుంగనూరు ఆవు 70 నుండి 90 సెం.మీ పొడవు ఉండే ఈ ఆవు... లీటరు పాలు గరిష్ఠంగా రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. పుంగనూరు ఆవు పాలలో అనేక ఔషధ గుణాలు ఉండటంతో పాలతో పాటు నెయ్యికి భారీ డిమాండ్ ఉంది. దీన్నుంచి తయారయ్యే నెయ్యి కిలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతోంది. ఈ పుంగనూరు ఆవు పాలతోనే తిరుపతి వెంకటేశ్వరస్వామికి పూజలు చేస్తారు. తిరుపతిప్రసాదాల్లోనూ ఈ ఆవు పాలనే ఉపయోగిస్తారు.
Delhi | Prime Minister Narendra Modi feeds cows at his residence, on the occasion of #MakarSankranti pic.twitter.com/UnijjBGk6O
— ANI (@ANI) January 14, 2024