అన్వేషించండి

RK Roja: జగన్‌పై రాళ్లతో హత్యాయత్నం, చంద్రబాబు పనే - రోజా తీవ్ర ఆరోపణలు

AP Latest News: చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి ఆర్కే రోజా నిరసన తెలిపారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Minister RK Roja: సీఎం జగన్‌పై విజయవాడ ఎన్నికల ప్రచార రోడ్ షోలో జరిగిన రాయి దాడిని ఖండిస్తూ మంత్రి రోజా రోడ్డుపై నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి మంత్రి ఆర్కే రోజా నిరసన తెలిపారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర దాడి చేయించారని మంత్రి రోజా ఆరోపించారు.

ప్రజలు అభిమానించే నాయకుడిని చంపి అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో ఐదేళ్ల క్రితం జగన్ ను విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో పొడిచి చంపాలని చూశారని.. ఇప్పుడు వీధి దీపాలు ఆపేసి ఈ విధంగా కుట్రకు పాల్పడ్డారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడితో రాష్ట్ర ప్రజలందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారని అన్నారు. జగన్ రక్తం చూసిన మీకు మే 13న ప్రజలు ఓట్లతో మీకు రక్తకన్నీరు తెప్పిస్తారని రోజా వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సంఘం సీరియస్

సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణాకు ఫోన్ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకున్నారు. తమకు పూర్తి నివేదికను పంపించాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ నిందితులను త్వరగా గుర్తించాలని నిర్దేశించారు.
 
మరోవైపు, సీఎం జగన్ పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. ఘటన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పూర్తిగా చీకటి, చెట్లు ఉన్న చోటి నుంచి నిందితుడు ఎవరికీ కనిపించకుండా.. దాడి చేశారని తెలుస్తోంది. అక్కడి నుంచి నిందితుడు సులభంగా తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. దాదాపు 30 అడుగుల దూరం నుంచి రాయిని బలంగా విసిరినట్లు భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget