అన్వేషించండి

YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసుల అనుమతి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనలో హెలిప్యాడుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జన సమీకరణపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) చిత్తూరు పర్యటనలో హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి సమీపంలో తగ్గువారిపల్లి దగ్గర వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు నుంచి అనుమతి లభించింది. ఇటీవల ఆయన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ హెలిప్యాడ్ కు అనుమతి రానందున జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

జన సమీకరణకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 10 వేల మందితో వెళ్లేలా అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. మార్కెట్ యార్డులో ఉన్న పరిస్థితి దృష్టిలో ఉంచుకుని కొద్దిమందినే అనుమతించే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలను దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లా పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

వైఎస్ జగన్ పర్యటన ఆగదు

వైఎస్ జగన్ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్నారు. ఈ సమాచారం తెలియగానే కూటమి నాయకులు మామిడి రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్ జగన్‌ను కలవద్దని, ఏ సమస్యలు ప్రస్తావించొద్దని కూటమి నేతలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. వైయస్ఆర్ సీపీ నేతలపై కేసులు తప్పవు అంటూ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు ఎన్ని ఆటంకాలు కలిగించినా బంగారుపాళెంలో జగన్ పర్యటన ఆగదు. టన్నులకొద్ది ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతుంటే ఆపాలని చూడని ఫారెస్ట్ అధికారులు మామిడి రైతు తన చెట్లను కొట్టేస్తే మాత్రం 12,000 రూపాయలు ఫైన్ వేశారు. -భూమన కరుణాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు

సింగయ్య మృతిపై కేసు నమోదు

పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే పార్టీ కార్యకర్త చనిపోవడం వివాదాస్పదమైంది. ఘటన జరిగిన కొన్ని రోజులకు జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతిచెందారని గుంటూరు ఎస్పీ సతీష్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వాహనం డ్రైవర్, మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న అవాంఛిత ఘటనలు, నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అందువల్లే తాము ఇచ్చే పర్మిషన్ మేరకు పర్యటన చేస్తే ఎవరికి ఏ సమస్యా ఉండదని అధికారులు చెబుతున్నారు.

హెలిప్యాడ్‌కు రాని అనుమతి - జగన్ నెల్లూరు పర్యటన వాయిదా
జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ జగన్ జులై 3వ తేదీన నెల్లూరు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే హెలిప్యాడ్ కు పోలీసుల నుంచి అనుమతి రానందున పర్యటనను వాయిదా వేసుకున్నారని వైసీపీ నేతలు తెలిపారు. మాజీ సీఎం జగన్ హెలికాప్టర్ ద్వారా నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడుకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ కు అధికారుల నుంచి అవసరమైన అనుమతులు రాలేదు. దాంతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు. జూన్ 27, 2025న ఈ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నా, అధికారులు  అనుమతి ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హెలిప్యాడ్ స్థలం యజమానిపై సైతం ఒత్తిడి  చేసి, బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget