అన్వేషించండి
Advertisement
Chittoor Tensions: పుంగనూరులో తగ్గని ఉద్రిక్తత! రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు
AP News: ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన్ను పుంగనూరులో అడుగు పెట్టనివ్వబోమని గతంలో తేల్చి చెప్పిన టీడీపీ శ్రేణులు.. ఇప్పుడు ఆయన పుంగనూరుకు రావడంతో ఆందోళనలు చేస్తు్న్నారు.
Telugu News: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతగా ఉంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో రెడ్డప్ప ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పరస్పరం రాళ్ళ దాడి జరిగింది. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటనను అడ్డుకునే లక్ష్యంతో అనేక ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా, మిథున్ రెడ్డి మాత్రం తన పర్యటన కొనసాగించారు. దీంతో ఆయనపై కూడా టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు.
రెడ్డప్ప ఇంట్లోనే మిథున్ రెడ్డి ఉండగా.. అక్కడి నుంచి వెళ్లబోనని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆందోళన కారులు రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టారు. రెడ్డప్ప నివాసానికి ఏఎస్పీ చేరుకొని మిథున్ రెడ్డితో చర్చలు కూడా జరిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement