అన్వేషించండి

Chandrababu: శ్రీసిటీ 8వేల ఎకరాల్లో 220 కంపెనీలకు ఛాన్స్, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ - చంద్రబాబు

Sri City News: శ్రీసిటీలో సీఎం చంద్రబాబు పలు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు.

Chandrababu Sri City Visit: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామికరంగం వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. శ్రీ సిటీ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్టివ్ ఇండస్ట్రీయల్ జోన్ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోమవారం శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించిన సీఎం... మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు శ్రీసిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. 

220 కంపెనీలకు చోటు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వచ్చాయి. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయం

శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. శ్రీసిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది.

నాలుగేళ్లు నెంబర్ 1
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నాలుగేళ్లు నెంబర్ వన్ గా ఉన్నాం. 2029 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతుంది. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అదీ ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం. రానున్న 25 సంవత్సరాల్లో 15 శాతం వృద్ధి రేటు మా లక్ష్యం. జీరో పావర్టీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. పీ4 మోడల్ అమలు చేస్తున్నాం. టాప్ 10 శాతంలో ఉన్నవారు కింది 20 శాతంలో ఉన్నవారికి సాయం అందించాలి. డెమోగ్రఫిక్ మేనేజ్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తాం. అనుకూల వాతావరణం కల్పిస్తాం. డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తాం. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ మా లక్ష్యం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం అని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి అనిత, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్,  ఎమ్మెల్యేలు శ్రీ. కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమల రావు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ & ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, శ్రీసిటీ యాజమాన్యం, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget