అన్వేషించండి

Brain Dead: ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి తిరుపతికి గుండె తరలింపు, నిండు ప్రాణం కోసం!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా మరో మూడు ఆసుపత్రులకు తరలించారు.

చేతికంది వచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉన్నాడు. బతుకుతాడని ఏ మూలో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు.. ‘మీ అబ్బాయి బ్రెయిన్‌డెడ్‌’ అంటూ వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని ఆ కుటుంబం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారణ అయిన యువకుడు మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపాడు.

చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే దాతల పెద్దమనసు పలువురు బాధితులకు వరంగా మారుతోంది. శరీరంలోని అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలనూ కాపాడుతోంది. సామాజిక స్పృహ కలిగిన కొద్ది మంది తమ మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆప్తులు మరణ అంచుల్లో ఉన్నప్పటికీ మరికొందరు.. పరుల మేలు ఆలోచించి.. పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా బ్రైయిన్ డెడ్ అయిన అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం.. మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపనుంది.

గుండె.. కాలేయం.. కళ్లు.. కిడ్నీలు.. ఇలా ముఖ్య అవయవాల కోసం నిరీక్షిస్తున్న వారెందరో ఉన్నారు. మనం చనిపోయిన కూడా మరొకరికి పునఃజన్మ ఇవ్వడానికి మేమున్నామంటూ ముందుకొచ్చి దానం చేస్తున్నారు. అలాగే తాజాగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో ఆదర్శప్రాయమైంది.

ఈమధ్యకాలంలో అవయవదానం ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతోంది. బాధితుల బంధువులు, తల్లిదండ్రుల ఔదార్యంతో అవయవాల దానం ప్రాణాలకు ఆసరాగా నిలుస్తోంది. విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలని ఆకాంక్షించి అవయవదానానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...

కృష్ణాజిల్లా చిన్న ముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయ ప్రకాష్ (22) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్స కు స్పందించకపోవడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. వెంటనే విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానానికి ఒప్పుకున్నారు.  విషాదంలోనూ తల్లిదండ్రులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొడుకు మరో రూపంలో బ్రతికే ఉండాలని ఆకాంక్షించి జీవన్ దాన్ కింద అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాటుచేసిన వేరు వేరు ప్రాంతాల్లోని మూడు ఆసుపత్రులకు జయప్రకాష్ గుండె, కాలేయం, మూత్రపిండాలు తరలించినట్లు ఆయుష్ ఆస్పత్రి చైర్మన్ రమేష్ బాబు తెలిపారు.  గారపాటి జయ ప్రకాష్ గుండెను గ్రీన్ ఛానల్ రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్ పోర్ట్ కు తరలించారు.

ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి తిరుపతికి.. 
అవయవ దానంలో భాగంగా జయ ప్రకాష్ గుండెను వైద్యులు సేకరించారు. వైద్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ఛానల్‌ ద్వారా గుండెను తొలుత అంబులెన్స్ లో రోడ్డు మార్గాన గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన తరలించారు. తరువాత గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ హాస్పిటల్ కు తరలించారు. ఒక కిడ్నీ ఆయుష్ హాస్పిటల్ కు, లివర్ ను మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు పక్కగా జాగ్రత్తలు చేపట్టారు. అంబులెన్స్ ఎక్కడ ఆగకుండా నేరుగా ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లే విధంగా ప్రణాళికలు వేశారు. ఎక్కడ కూడా ఆలస్యం అవ్వకుండా అనుకున్న సమయానికి అంబులెన్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ కు తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ హాస్పిటల్ కి తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget