అన్వేషించండి

Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్, తిరుపతిలో పోలీసులు హై అలెర్ట్, ఆ ప్రాంతాల్లో పెరిగిన నిఘా

Bharat Bandh Today: గత వారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగడం, ఆపై రైలు బోగీలను తగలబెట్టడంతో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీలో పలు చోట్ల నిఘా పెంచారు.

Bharat Bandh 144 Section In Tirupati: తిరుపతి : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల పిలుపుమేరకు నేడు భారత్ బంద్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు సహా తిరుపతి నగరంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. గత వారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగడం, ఆపై రైలు బోగీలను తగలబెట్టడంతో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీలో పలు చోట్ల నిఘా పెంచారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో మరింతగా పోలీసు బలగాలను మోహరించారు. రైల్వే స్టేషన్ ముందు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేవలం ఒక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణికులు రాక పోకలు కొనసాగించే విధంగా పోలిసులు చర్యలు చేపట్టారు. మిగిలిన మూడు మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలను నిషేధించడమే కాకుండా ఆక్టోపస్, సీఆర్పీఎఫ్, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టు దిట్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు.

తిరుపతిలో 144 సెక్షన్
తిరుపతి రైల్వే స్టేషనుతో పాటు గూడూరు, పాకాల రైల్వే జంక్షన్ల వద్ద దాదాపుగా 500 మంది పోలీసులతో బందోబస్తులు కల్పించారు.. భారత్ బంద్ నేపధ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేయడం (144 Section Imposed in Tirupati)తో పాటుగా ఎవరూ గుంపుగా గుమి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాంమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ప్రకటించారు. విద్యార్ధులను రెచ్చగొట్టి రైల్వేస్టేషన్ కు వచ్చి విధ్వంసం సృష్టిస్తారోమో అనే ఉద్దేశంతో ముందస్తుగానే విద్యార్ధి సంఘ నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా
తిరుపతిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే భక్తులకు మినహా ఇంపు ఇస్తూ, భక్తులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ వద్దకు ఎటువంటి వాహనాలు, బస్సులను పోలీసులు అనుమతించక పోవడంతో ప్రయాణికులు నడుచుకుంటూ బస్ స్టాండ్ చేరుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో చిన్నారులు, వృద్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైల్వే స్టేషను లోపల పోలీసు బలగాలతో పాటుగా పరిస్ధితి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు పోలీసులు. 

Also Read: Also Read: Agnipath Protests: అగ్నివీరులకు మేం ఉద్యోగాలిస్తాం, కార్పొరేట్‌ రంగానికి కావాల్సింది వాళ్లే-ఆనంద్ మహీంద్రా ట్వీట్ 

Also Read: Viral News: 30 ఏళ్ల తరువాత ఎగ్జామ్ - టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌లో తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
IND Vs BAN Innings Highlights: బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW Vs PAKW Highlights: సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
సెమీస్ రేసులోకి టీమిండియా ఈజ్ బ్యాక్ - టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై ఘనవిజయం!
CM Revanth Reddy: 'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'కేసీఆర్ ఉద్యోగం పోయి పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి' - మురికి కూపమైన మూసీని ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
IND Vs BAN Innings Highlights: బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు - ప్రధాని మోదీతో భేటీ
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Hyderabad News: భార్యతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Best Budget Sports Bikes: రూ.1.5 లక్షల్లో స్పోర్ట్స్ బైక్ లుక్ వీటికే సొంతం - ఏ బైక్స్ ఉన్నాయో తెలుసా?
రూ.1.5 లక్షల్లో స్పోర్ట్స్ బైక్ లుక్ వీటికే సొంతం - ఏ బైక్స్ ఉన్నాయో తెలుసా?
Embed widget