Minister RK Roja: చంద్రబాబును మళ్లీ, మళ్లీ అరెస్ట్ చేస్తాం- లోకేష్, అచ్చెన్న సిద్ధంగా ఉండండి- ముందుంది ముసళ్ల పండుగ : రోజా
Minister RK Roja: చంద్రబాబు అరెస్ట్ సమంలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని మంత్రి రోజా అన్నారు. తాను నిప్పు అని తన పచ్చమీడియాతో చంద్రబాబు డబ్బా కొట్టించుకున్నారని మండిపడ్దారు.
Minister RK Roja: చంద్రబాబు అరెస్ట్ సమంలో ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారరి మంత్రి రోజా అన్నారు. తాను నిప్పు అని తన పచ్చమీడియాతో చంద్రబాబు డబ్బా కొట్టించుకున్నారని మండిపడ్దారు. ప్రజలు మభ్యపెట్టడానికి యత్నించారని విమర్శించారు. చంద్రాబాబకు రాత్రి పూట కాళ్లు పట్టుకునే అలవాటు ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుని తప్పించుకుంటూ వచ్చారు. జగన్ పాలనలో మేనేజ్ చేయడం కుదరదన్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అన్నారు. బోగస్ కంపెనీలకు బాబు బ్రాండ్ అంబాసిడర్, అవినీతి అనకొండ అన్నారు. సాక్ష్యాధారలతో దొరికారు కాబట్టే చంద్రబాబుకు రిమాండ్ విధించారని అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యం కాదని, అవినీతిలో కూరుకుపోయిన మట్టి ముత్యం అని విమర్శించారు.
ప్రభుత్వానికి కక్ష సాధించాలని అనుకుంటే 2019 లేదా 2021లోనే అరెస్ట్ చేసేవారని రోజా అన్నారు. రాజశేఖర్ రెడ్డి కలలను సాకారం చేసేందుకే జగన్ పార్టీ పెట్టారని, ఆయన్ను చాలా మంది వేధించినా, భగవంతుడి ఆశీస్సులతో అన్నింటిని ఎదుర్కొని తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచెత్తితే జగన్ సరైన దారిలో నడిపిస్తున్నారని అన్నారు. చెప్పిన పథకాలు అన్నీ అమలు చేసిన సంక్షేమ సామ్రాట్ జగన్ చెప్పారు. రాత్రిపూట సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని, తెల్లపేపరు మీద సంతకం చేసి జగన్‌ను వేధించారే దాన్నే కక్ష సాధింపు అంటారని అన్నారు. చంద్రబాబు కేసులో సీఐడీకి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చిందని, ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందన్నారు.
కోర్టులో సైతం చంద్రబాబు వాదనలు వినిపించారని, అందులో ఆయన తప్పు చేయలేదని, స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం జరగలేదని చంద్రబాబు చెప్పారా అంటూ ప్రశ్నించారు. 241 కోట్ల కుంభకోణం జరగలేదని ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆయన ఏమైనా చెప్పారా అంటూ నిలదీశారు. టెక్నికల్‌గా తప్పించుకోవానికి చూశారే తప్ప తాము తప్పు చేయలేదని ఎక్కడా వాదించలేదన్నారు. చంద్రబాబు హయాంలో స్కాం జరిగినట్లు జీఎస్టీ అధికారులు లేఖ రాశారా లేదా అని ప్రశ్నించారు. 2018లో ఏసీబీ విచారణ ప్రారంభంచిందా లేదా అని ప్రశ్నించారు. ఈడీ విచారణలో నలుగురుని అరెస్ట్ చేశారో లేదో చెప్పాలన్నారు. అధికారులను ఒత్తిడి చేసిన నిధులు విడుదల చేసిందిన నిజమా కాదా అన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆధారాలతో పక్కాగా దొరికితే వారిని అరెస్ట్ చేస్తే ఇది అక్రమ కేసులు అని గగ్గోలు పెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు.
చంద్రబాబుపై చాలా కేసులు ఉన్నాయని, ఫైబర్ గ్రిడ్, పోలవరం, పట్టిసీమ, అమరావతి భూములు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు చాలా ఉన్నాయని వాటన్నింటిలో ఆధారాలు దొరికితే మళ్లీ మళ్లీ అరెస్ట్ చేస్తామని, ఇది ప్రారంభం మాత్రమేనని, ముగింపు కాదన్నారు. తొందర్లోనే లోకేష్, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తారని, అందుకు వారు సిద్ధంగా ఉండాలన్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా, దత్తపుత్రుడి భాష మారలేదన్నారు. జగన్‌ను జైలు రెడ్డి అని పిలిచారని, ఇప్పుడు తాము జైలు చౌదరి, జైలు నాయుడు అని, రాజమండ్రి జైలు పిలవమా అంటూ ప్రశ్నించారు. అవినీతి సైకో చంద్రబాబు అన్నారు. దత్తపుత్రుడు, ఉత్త పుత్రుడు, టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.