AP Politics: ఎన్టీఆర్ ఆత్మఘోషతోనే చంద్రబాబు దినదిన పతనం - ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
Narayana Swamy Comments against Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదిన పతనం మొదలైందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
Narayana Swamy Comments against Chandrababu: తిరుపతి : టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఉపయోగించుకొని ఓట్లు పొందారని, సీఎం జగన్ మాత్రం బీసీలు విద్యావంతులు అవ్వాలని ఆకాంక్షిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదిన పతనం మొదలైందని చెప్పారు. నారాయణ స్వామి బుధవారం ఉదయం స్వామి తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో దర్శనం అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ... కులమత బేధాలు లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న సీఎం జగన్ కు శ్రీవారు అన్నివిధాలా తోడు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను ఉపయోగించుకొని ఓట్లు పొందారని, సీఎం జగన్ మాత్రం బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. బీసీలు విద్యావంతులు అవ్వాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని, టీడీపీ నాయకులు వ్యక్తిత్వం లేని వాళ్లు అంటూ మండిపడ్డారు. తిరుమల ఆలయం ముందు చంద్రబాబు గురించి మాట్లాడితే బాగోదని, ఎన్టీఆర్ ఆత్మఘోష వల్ల చంద్రబాబు దినదినాభి పతనం మొదలైందన్నారు.
బీసీలకు ఏమీ ప్రయోజనం చేకూర్చని నేతగా చంద్రబాబు మిగిలిపోతారన్నారు. బీసీలకు అగ్రతాంబూలం ఇస్తూ 5 మందికి మంత్రి పదవి, ఇద్దర్ని ఎంపీలను చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం అయిందన్నారు. రాష్ట్రంలో బీసీలు బాగుపడాలని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని, కానీ ఎన్టీఆర్ పెట్టిన పధకాలను కొనసాగిస్తా అని రెండు రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి, వాడవాడలా బెల్టు షాపులు పెట్టిన ఘనత చంద్రబాబుదే అని చెప్పిన ఆయన, బీసీ జపం చేసి బీసీలను అణగదొక్కిన ఘటనను ఎవరూ మరిపోరని చెప్పారు.
ఎన్టీఆర్ కు చేసిన ద్రోహానికి చంద్రబాబు పిచ్చివాడిలా మారిపోయే పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో వాడవాడలా అభివృద్ధి జరుగుతోందని, రూ.300 కోట్లతో రోడ్లను మా నియోజకవర్గంలో నిర్మించామని నారాయణ స్వామి చెప్పారు. కేవలం తమ నియోజకవర్గంలోనే కల్వకుంట్ల ప్రాజెక్ట్ కు రూ. 190 కోట్లు నిధులు విడుదల అయ్యిందని, అర్బన్, రురల్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయడం అభివృద్ధి కదా అని ఆయన ప్రశ్నించారు. కళ్లు ఉండి చంద్రబాబు అంధుడిగా మారిపోయారని, నిజాలను సైతం వినలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఉద్యోగులకు ఏం చేశారని, రాయలసీమలో ప్రజలతో పాటు, కోస్తా ఆంధ్రాలో ప్రజలు సైతం వారికి ఓట్లు వేయలేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వైసీపీ మూడు రాజధానులు తీసుకువస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పదవి దాహంతోనే చంద్రబాబు రగిలిపోతున్నాడని, కుప్పం ప్రజలు సైతం చంద్రబాబును తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
తిరుపతి : తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి దేవినేని ఉమా దర్శించుకున్నారు.. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.. స్వామి వారు ఏపి రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు..