News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Deputy CM: పవన్‌కు వచ్చిన పరిస్థితే లోకేష్‌కు, చంద్రబాబుకు ఆ ఆలోచన ఎందుకు రాలేదో - ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

అనేక సార్లు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా ఈ సారి ప్రత్యేకమైన ఆనందం కలిగిందన్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఢిల్లీలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు.

FOLLOW US: 
Share:

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు వచ్చిన పరిస్థితే నారా లోకేష్ కు రాబోతుందని, చంద్రబాబుని, నారా లోకేష్ ను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని ఏపీ డిప్యూటీ స్పీకర్ ‌కొలగట్ల వీరభధ్ర స్వామి విమర్శించారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డెప్యూటీ స్పీకర్ కోరగట్ల వీరభధ్రస్వామి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ. అనేక సార్లు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నా ఈ సారి ప్రత్యేకమైన ఆనందం కలిగిందన్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఢిల్లీలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారన్నారు.

రానున్న కాలంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసలు ఆగిపోయాయని అన్నారు. అసలు వలసలు వెళ్ళాలనే ఆలోచనలు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పారు. ఆసియాలో అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఉందని, గతంలోనే చంద్రబాబు హయాంలో విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించి ఉంటే హైదరాబాద్‌తో పాటే అభివృద్ధిలో‌ నడిచేదని అన్నారు. విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించాలని చంద్రబాబుకు ఆలోచన రాకపోవడం దురదృష్టంమని ఆయన అన్నారు.

ఇప్పటికైనా చొరవ తీసుకుని విశాఖపట్నంను క్యాపిటల్ గా ప్రకటించడంతో యావత్ ఆంధ్రలో ఒక్క పేరున్న నగరంగా రూపొందుకుంటుందన్నారు. అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చేందుకు అవకాశం ఉందని, శ్రీనివాసుడి ఆశీస్సులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు శంకుస్థాపన చేస్తామని, విశాఖపట్నం ఆంధ్రకు తలమానికంగా నిలబడుతుందని అన్నారు. బాంబు పడుతుందంటే భయం వేస్తుంది కానీ సీమ టపాకాయ వచ్చిందంటే భయం ఎందుకు వేస్తుందని అన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సభలు పెట్టి అడ్డుకుంటున్నారు అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారని విమర్శించారు.

గతంలోనే చెప్పాం లోకేష్ పాదయాత్రకు చేస్తే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, పవన్ కు 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని, పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే జనం వెళ్ళటం లేదా అని, అలాగే లోకేష్ వస్తున్నాడంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్తారని అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర వచ్చే జనాల కంటే 2019లో పవన్ కు ఇంతకంటే ఎక్కువ జనం చూసామని, గత ఎన్నికల్లో పవన్ ఒక్క సీటు గెలువలేక పోయాడని, ప్రజాభిమానం ఉందని గడప గడప‌ కార్యక్రమంతో తెలుస్తుందని అన్నారు. ప్రజా అభిమానం ఉందో‌ లేదో‌ తెలుసుకునేందుకు బాదుడే బాదుడు, ఇదేంఖర్మ మనకు కార్యక్రమంతో ఇంటింటికి వెళ్తే ప్రజల అభిమానం ఏంటో తెలుస్తుందన్నారు. సోషల్ మీడియాతో ప్రజలు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారని, చంద్రబాబును, లోకేష్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో‌ లేరని ఆయన అన్నారు.

Published at : 10 Feb 2023 01:03 PM (IST) Tags: Tirumala news AP Deputy CM Chandrababu Kolagatla veerabhadra swamy Vizag capital news

ఇవి కూడా చూడండి

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

TTD News: గరుడ సేవ వేళ భక్తులతో తిరుమల కిటకిట - ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!

Tirumala Brahmotsavam 2023: తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!

Tirumala News: తిరుమలలో ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు- సాయంత్రం గరుడ వాహన సేవ

Tirumala News: తిరుమలలో ఐదోరోజు మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు- సాయంత్రం గరుడ వాహన సేవ

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279