అన్వేషించండి

Tirumala: తిరుమల ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు, తరచూ ఇవే ఘటనలు!

తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గత జూన్ 8న ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

తిరుమల కొండపై గగన తళంలో నిత్యం విమాన రాకపోకలు జరుగుతుండడం పరిపాటిగా మారిపోయింది. గత కొద్దీ రోజులుగా ప్రతి నిత్యం తిరుమల కొండపై శ్రీవారి ఆలయంకు పైభాగంలో,‌ ఆలయానికి సమీపంలో విమానాలు తరుచూ వెళ్తుండడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు కూడా ఏకంగా‌ ఆలయానికి పైభాగంలోనే విమానం వెళ్ళింది. శ్రీవారి ఆలయంపై గగనతలంలో ఎటువంటి రాకపోకలు సాగకూడదని టీటీడీ ఆగమ పండితులు చెబుతూ ఉన్నారు. కానీ తిరుమల కొండ గగనతలంలో విమానాలు వెళ్తుండడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

తిరుమల శ్రీవారి ఆలయ సమీపం నుంచి గత జూన్ 8న ఉదయం 7.45, 8.00, 8.22 గంటలకు వరుసగా 3 విమానాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. ఈ ఘటనపై టీటీడీ భద్రతాధికారులు పరిశీలించినట్లు తెలిసింది. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీనిపై గతంలో తితిదే కేంద్ర పౌర విమానయానశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అయినా తాజాగా ఇప్పుడు కూడా మరో విమానం వెళ్లింది.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ‌ ఎమ్మెల్సీ రగోత్తంరెడ్డి, తమిళనాడు ఎంపీ‌ అనుబమని రాందాస్, పాండిచ్చేరి మాజీ సీఎం వైద్య లింగం, సినీ నటి రాధిక, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల ‌మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో కాంగ్రెస్ ‌మాజీ ఎంపీ‌ పొన్నం ప్రభాకర్

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్తుందో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలుకు వచ్చిన పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం గానీ,‌ తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాయని, దీంతో దేశంలోనూ, తెలంగాణలోనూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. త్వరలోనే దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో ప్రజల్లో మరింత ఊపు వచ్చిందని, అదేవిధంగా దేశంలోని అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంను కాపాడే కునేందుకు నరేంద్ర మోడీని గద్ద దించాలని భావిస్తున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

శ్రీవారి సేవలో సినీ నటుడు నిఖిల్

తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో నిఖిల్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ‌వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ. తొలి ఏకాదశి‌నాడు శ్రీ‌ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, స్పై సినిమా బ్రహ్మాండంగా విడుదల అయ్యిందన్నారు. శ్రీనివాసుడికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, ఇలాంటి ఓపెనింగ్ వస్తుందని జీవితంలో నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. 1600 స్క్రీన్స్ వేస్తే హౌస్ పుల్ క్రౌడ్స్ కనిపించిందని, స్పై సినిమా చూసి ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భిన్న నేపథ్యంలో రూపొందించిన సినిమా స్పై అని,‌ కార్తికేయ-3 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని నిఖిల్ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Embed widget