News
News
వీడియోలు ఆటలు
X

Tirupati Temple Fined : టీటీడీకి ఆర్బీఐ షాక్, రూ.4.31 కోట్ల జరిమానా!

Tirupati Temple Fined: టీటీడీకి ఆర్బీఐ రూ.4.31 కోట్ల ఫైన్ విధించింది. విదేశాల నుంచి వచ్చిన కానుకల వివరాలు తెలపకపోవడం, ఎఫ్సీఆర్ఎ కాలపరిమితి ముగియడంతో కేంద్రం జరిమానా వేసింది.

FOLLOW US: 
Share:

Tirupati Temple Fined:  తిరుమల తిరుపతి ‌దేవస్థానానికి ఆర్బీఐ నాలుగు కోట్ల 31 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. తిరుమల శ్రీవారికి వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే కొందరు హుండీలో నగదు రూపంలో కానుకలు సమర్పించి‌ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క రూపాయి‌ నుంచి కోట్ల రూపాయలు నగదు, బంగారు, వెండి, వివిధ విదేశీ కరెన్సీ నోట్లను శ్రీవారి దర్శనంతరం హుండీలో సమర్పిస్తూ‌ ఉంటారు భక్తులు. ఎవరు ఎంత నగదు వేశారో అనే వివరాలు ఎవరికీ తెలియదు. స్థోమతకు తగ్గట్టుగా హుండీ కానుకలు సమర్పించే సౌలభ్యం ఉండడంతో కానుకలు వేసి వెళ్లిపోతుంటారు భక్తులు. ఇక ఈ హుండీలో సైతం ఎంతో మంది అజ్ఞాత భక్తులు, విదేశీ భక్తులు నగదును ట్రాన్సఫర్ చేస్తుంటారు. వీరి వివరాలు ఏమాత్రం టీటీడీకి అసలు తెలియజేయరు. ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలైన అమెరికా, ఇంగ్లండ్, అరబ్ దేశాలు, ఆస్ర్టేలియా, సింగపూర్, కెనడా, సింగపూర్, మలేషియా వంటి‌ దేశాల నుంచి కానుకలను ఈ‌హుండీ ద్వారా భక్తులు నగదును బదిలీ చేస్తుంటారు. ఇలా నగదును బదిలీ‌ చేసిన వారు చాలా వరకూ వివరాలు తెలిపేందులు‌ ఇష్టపడకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇలా వివరాలు తెలియజేయకుండా నగదును ఈహుండీ‌ ద్వారా పంపడం ద్వారా టీటీడీకి సుమారు 26 కోట్ల రూపాయలు అందాయి. 

ఈ-హుండీలో విదేశీకానుకలు 

ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి యూఎస్ డాలర్లు 11.50 కోట్లు, మలేషియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు ఉండగా, ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంకు టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా కాలం పొడిగిస్తూ వచ్చింది. అయితే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించింది. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టీటీడీకి 2019లో 1.14 కోట్ల రూపాయలు అపరాధ రుసుము విధించింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 5న కేంద్ర ఎఫ్.సి.ఆర్.ఎ విభాగం వార్షిక రిటర్న్‌ల్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని, టీటీడీ ఉన్నత అధికారులకు లేఖ రాస్తూ మళ్లీ  రూ. 3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా రెండు సార్లు అపరాధం విధించిన మొత్తం 4.31 కోట్ల రూపాయలు. అంతే కాకుండా టీటీడీకి రాసిన లేఖలో ఏపీ దేవదాయ శాఖ తప్పులను ఎత్తు చూపుతూ టీటీడీకి లేఖను‌ పంపింది. అయితే చాలా వరకూ ఈ హుండీ ద్వారా నగదును పంపిన భక్తుల వివరాలను టీటీడీ ఆర్బీఐకి‌ పంపలేకపోయింది. 

రూ.4.31 కోట్ల జరిమానా 

ఇదే అంశాన్ని‌ టీటీడీ లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయగా, ఇదే విషయంపై న్యాయస్థానాల్లో కోసం ఫిటీషన్లు దాఖలు చేయగా, హుండీలో వేసిన కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానం కార్పస్‌లో భాగమేనని ఏపీసీహెచ్‌ఆర్ చట్టంలోని సెక్షన్ 111 పేర్కొన్నట్లు టీటీడీ తన వాదనలను వినిపించింది. అందుకే తమ రిటర్న్ లలో విదేశాల నుంచి వచ్చిన ఈ-హుండీ కానుకలను కూడా చూపించినట్టు తెలియపరిచింది.  అయితే ఎస్బీఐ టీటీడీకి చెల్లించకుండా పక్కన పెట్టిన 26 కోట్లకు వడ్డీ కూడా చెల్లించకపోవటంతో దానిపైన టీటీడీ కేంద్రానికి విన్నపాలు పంపినా  కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపింది.ఈ నగదు మొత్తంపైన కేంద్రం తెలిపిన విధంగా వివరాలు సేకరించి, టీటీడీ మళ్లీ గత మార్చి26న రిటర్నులు దాఖలు చేసింది. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రూ. 3.19 కోట్ల జరిమానాను టీటీడీకి విధించింది.  ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ధార్మిక సంస్థకు కొంత మినహాయింపు‌ ఇవ్వాలంటూ టీటీడీ ఆర్బీఐని పలుమార్లు కోరింది. అయితే టీటీడీ విన్నపాన్ని ఆర్బీఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగు కోట్ల ‌ముప్పై‌ ఒక్క లక్షల రూపాయల అపరాధ రుసుంను టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అయితే 2018లో ముగిసిన ఎఫ్సీఆర్ఏ‌ లైసెన్స్ ను త్వరలోనే‌ కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

Published at : 27 Mar 2023 09:37 PM (IST) Tags: Fine TTD Tirumala Tirupati Foreign Contributions

సంబంధిత కథనాలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్‌ పోస్టులు - వివరాలు ఇలా!

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

Nara Lokesh: ప్యాలెస్‌లు ఉన్న జగన్ పేదోడా? వైసీపీ గలీజ్ పార్టీ - మహానాడులో నారా లోకేశ్

టాప్ స్టోరీస్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా