By: ABP Desam | Updated at : 27 Dec 2022 09:32 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైవీ సుబ్బారెడ్డి
Tirumala News : శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ఏటా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. సర్వ దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 9 ప్రాంతాల్లో 92 కౌంటర్లల్లో టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరితగతిన భక్తులకు దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నాలుగు లక్షల యాభై వేల టోకెన్లు
జనవరి 2 నుంచి 11న వరకూ సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లను జనవరి ఒకటో తేదీన జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పది రోజుల టోకెన్లు పూర్తి అయ్యే వరకూ టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నామని వెల్లడించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకీన జెడ్పీ హైస్కూల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్ జెడ్పీ హైస్కూల్, గోవింద రాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్నామని తెలియజేశారు. సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్యూలైన్స్ లో ఉండే భక్తులకు, నీళ్లు, పాలు, టీ, కాఫీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తిరుమలలోని స్థానికుల కోసం కౌస్తభం అతిథి గృహం వద్ద కౌంటర్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
గదుల అడ్వాన్స్డ్ బుకింగ్ రద్దు
ఉచిత టోకెన్లు కలిగిన భక్తులు కృష్ణ తేజ అతిథి గృహం వద్ద రిపోర్టింగ్ చేయాలని, టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్దకు భక్తులు సులువుగా వెళ్ళేందుకు క్యూఆర్ కోడ్ సిస్టంను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్లైన్ లో 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లకు సంబంధించి జనవరి 1, 2 నుంచి 11వ తేదీ వరకూ 2 లక్షల 5 వేల టోకెన్లు విడుదల చేశామన్నారు. రోజుకు రెండు వేల చొప్పున శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు జారీ చేశామని తెలిపారు. టికెట్లు లభ్యతను ముందే తెలుసుకుని తిరుమల యాత్రపై భక్తులు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. భక్తులు తమకు నిర్దేశించిన సమయానికి తిరుమలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి వారి దర్శనం కలిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వ తేదీ వరకూ గదుల అడ్వాన్స్డ్ బుకింగ్ కేటాయింపు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. తిరుమలకు వచ్చే ఒక్కో వీఐపీలకు రెండు గదులు మాత్రమే కేటాయిస్తున్నామన్నారు. జనవరి 2, 3 తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నామని తెలిపారు.
మాస్కులు తప్పనిసరి
వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై విహరిస్తారని, ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి 5:30 గంటల వరకూ స్వామి వారికి చక్రస్నానం నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులను తీసుకుని వచ్చి పది రోజుల్లో ఉచితంగా పది వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని, డిసెంబర్ 31, జనవరి 1న ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. గోవిందా మాలలు ధరించిన భక్తులు కూడా టోకెన్లు తీసుకుని తిరుమలకు రావాలని, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మూడు వేల మంది శ్రీవారి సేవకులను వినియోగించుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలియజేశారు.
Kotamreddy Vs Corporator : నెల్లూరు రూరల్ లో వార్ స్టార్ట్, కోటంరెడ్డి బెదిరిస్తున్నారని కార్పొరేటర్ ఫిర్యాదు
Union Budget 2023: తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.12, 824 కోట్లు కేటాయించాం: రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్
Kadapa Crime : ఆధార్ ఫింగర్ ప్రింట్స్ డూప్లికేట్, బ్యాంక్ అకౌంట్లలో కోటికి పైగా నగదు చోరీ
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్