By: ABP Desam | Updated at : 23 May 2022 07:11 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ రేపు(మంగళవారం) భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను మే 24న మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే విధంగా ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను మే 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. అయితే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది.
Raghurama hIghcourt : 3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దు - రఘురామకు రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు
TTD Defamation Case : టీటీడీ రూ.100 కోట్ల పరువు నష్టం కేసు, జులై 11కు వాయిదా!
Railway News: రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- రద్దీ మార్గాల్లోని ట్రైన్స్‌కు అదనపు ఫెసిలిటీ
Farmer ABV : చెప్పినట్లే వ్యవసాయం - సీరియస్‌గా తీసుకున్న సీనియర్ ఐపీఎస్ !
Breaking News Telugu Live Updates: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, సెప్టెంబర్ 27న ప్రారంభం
KTR Letter To PM Modi : బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ
Ramya Raghupathi: ఆమెకు మాటిచ్చాను, నరేష్‌కు విడాకులు ఇవ్వను: రమ్య రఘుపతి
Gold Rate Hike: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!
Pakka Commercial Movie Review - 'పక్కా కమర్షియల్' రివ్యూ: గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కించిన సినిమా ఎలా ఉందంటే?