అన్వేషించండి

AP Election Results 2024: సింహం విదేశాల నుంచి జూన్‌ 1న తిరిగొస్తుంది, 4న జూలు విదిలిస్తుంది: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

YSRCP will win AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, సీఎం జగన్ జూన్ 1న విదేశాల నుంచి తిరిగొస్తారని, 4న జూలు విదిలించుతారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.

Thopudurthi Prakash Reddy Predicts YSRCP wins AP Assembly Elections 2024: అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అది వైసీపీ వైపే ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి అన్నారు. పందెం కోళ్లు ప్రజా తీర్పును జూదంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య జరగలేదని, విశ్వసనీయత.. మోసానికి మధ్య జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశ్వసనీయతదే. ప్రజలు వైసీపీ పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేశారు. 

164 సీట్లు గెలవబోతున్నాం.. 
‘అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లూ గెలవబోతున్నాం. హిందూపురంలో బాలకృష్ణ కూడా జెండా పీకేసి చాప చుట్టేశారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ ఓడిపోతున్నారు. 164 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. కేవలం 4 సీట్లకు మాత్రమే చంద్రబాబు పరిమితం కాబోతున్నాడు. బీజేపీ, జనసేన 7 సీట్లలో గెలవబోతోందని’ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెర తీశారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందంటూ ఐప్‌ క్రియేట్‌ చేస్తూ తెలుగుదేశం పార్టి చోటామోటా నాయకులకు ఆశలు కల్పించి వారితో అప్పులు చేయించి పందెలు కట్టేలా చేయిస్తున్నారు. వైసీపీ తరపున పందేలు కడుతోంది కూడా ఓడిపోతున్న ఆ పార్టీ అభ్యర్థులే. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకునేందుకు వారే పందెం వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తూ పాము తన గుడ్లును తానే మింగినట్లు టీడీపీ తమ కార్యకర్తల సొమ్మును కాజేసేందుకు వారి అభ్యర్థులు కుట్ర పన్నారని’ ఆరోపించారు.  

ఏపీ సీఎం జగన్ అమలు చేసిన పథకాల గురించి చెప్పి వైఎస్సార్‌సిపి అభ్యర్థులు ఓట్లు అడిగారని, అన్నం పెట్టిన జగనన్నను గెలిపించమని ఓట్లు అడిగామన్నారు. మరి తెలుగుదేశం పార్టి అభ్యర్థులు మమ్మల్ని తిడుతూ ఓట్లు అడిగారు. మేం అధికారంలోకి వస్తే వారిని తొక్కుతాం, వీరిని తొక్కుతాం అంటూ వీరంగాలు చేస్తూ ప్రచారం మమ అనిపించారని ఎద్దేవా చేశారు. కనీసం చంద్రబాబు ఎజెండా కాని, సూపర్‌ సిక్స్‌ గురించి మాట్లాడే దైర్యం కూడా చేయలేదని, చంద్రబాబు ఒక పెద్ద మోసగాడు అని ప్రజలకు తెలుసునన్నారు. పైగా పథకాలేమీ లేవు అమరావతిలో పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్‌ వస్తాయని చంద్రబాబు మాట్లాడినట్లు ఆడియో కూడా వైరల్‌ అయినట్లు రాప్తాడు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

AP Election Results 2024: సింహం విదేశాల నుంచి జూన్‌ 1న తిరిగొస్తుంది, 4న జూలు విదిలిస్తుంది: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

‘సంక్షేమ పథకాలకు మద్దతుగా, ప్రభుత్వం చేసిన సాయానికి మద్దతుగా ఓటింగ్‌ జరిగింది. రాష్ట్రంలో జగనన్న ప్రభంజనం నడిచింది. చరిత్ర సృష్టించబోతున్నాం. జగన్ వైనాట్‌ 175 అనేది అంత ఆషామాషీగా చెప్పలేదు. అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకునే మాట్లాడాడు. మోసం, కుట్ర, మేనేజ్‌మెంట్‌తోనే ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలమనే బీజేపీతోనే జత కట్టాడు. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తమకు నచ్చిన అధికారులను ఎన్నికల్లో వేయించుకున్నారు. వారు ఎక్కడైతే అధికారులను వేసుకున్నారో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి. గెలుస్తామనే ఆశ చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. అందుకోసమే ప్రతి జిల్లాలోనూ సీట్లు అమ్ముకున్నాడు. 4వ తేది వరకు వస్తున్నాం.. వస్తున్నాం అంటూ ఎంజాయ్‌ చేయండి. కల కనండి. ఆ కలలోనే బతకండి. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటలకు నేలమీదకు దిగిరండి. అప్పుడు వాస్తవంలో జగన్ గెలవబోతున్నాడని’ తోపుదుర్తి వ్యాఖ్యానించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget