Vizag YSRCP : వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు విశాఖ నుంచి మరో కీలక నేత రెడీ - ఆయనెవరంటే ?
విశాఖ వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా జనసేన వైపు చూస్తున్నారంటున్నారు.
Vizag YSRCP : విశాఖపట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక నేత జంప్ జిలానీల లిస్ట్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా నిఘా పెట్టారని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలోకి చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే విశాఖ నుంచి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరబోతున్నారు.
మరికొంత మంది అధికార పక్షానికి చెందిన శాసన సభ్యులు భాహాటంగా తమ అసహనం... అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేతలు పార్టీలో ఇంకెంత మంది ఉన్నారనే విషయం పై ఇప్పుడు చర్చ మెదలైంది. తాజాగా విశాఖపట్టణం వేదికగా మరో కీలక నేత కూడా పార్టీ నుండి సైడ్ అయిపోయారని అంటున్నారు. ఇప్పటికే ఆ నేత పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగానే ఉంటున్నారనే టాక్ ఉంది. ముఖ్యమంత్రి, రాష్ట్ర స్దాయి నేతల కీలక సమావేశాలకు కూడా ఆయన హజరు నామ మాత్రంగానే ఉంటోంది. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వాహణ కు కూడ అంతగా ఇంట్రస్ట్ చూపించటం లేదని చెబుతున్నారు. దీంతో ఆయన పై పార్టీ పరంగా నిఘా పెరిగిందని చెబుతున్నారు.
విషయం తెలిసిపోవడంతో ఆయన కూడా పార్టీతో టచ్ మి నాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన విశాఖపట్టణం కేంద్రంగా ఆయనకు ఉన్న పాత పరిచయాలన్నింటిని రీ లోడ్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావటంతో ఎవరికి వారు వ్యక్తిగత అంచనాలు, సర్వేలు పైనే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేశారని చెబుతున్నారు. ఇతర పార్టీల తో ఉన్న పాత పరిచయాలు కారణంగా పార్టీ లో ఉన్న ప్రస్తుత పరిస్దితులు నేపద్యంలో ఆయన గోడ దూకేందుకు రెడీ గా ఉన్నారని అంటున్నారు. ఈ సమాచారం ఆ నోటా ఈ నోటా పార్టీ వర్గాలకు వరకు చేరింది. రెగ్యులర్ గా పార్టీ కేంద్ర కార్యాలయం నాయకులకు ఇచ్చే సమాచారం కూడ ఆయనకు ఇవ్వటం లేదనే టాక్ నడుస్తోంది..
ఇప్పటికే ఇలాంటి కొందరు నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టికి గట్టి ఝలక్ ఇచ్చారు. దీంతో అప్పటి నుండి పార్టీని వీడే అవకాశం ఉన్న నేతల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నజర్ పెట్టింది. అలాంటి వారి జాబితాలో విశాఖపట్టణం కు చెందిన కీలక నేత ఉన్నారని బయటకు వచ్చిందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమయిన సామాజిక వర్గ నేత కావటంతో ఆయన జనసేన వైపుకు ఎక్కువగా చూస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. దీంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
అయితే మరో వైపున పార్టీ లో ఆయన పై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారనే వాదన కూడ వినిపిస్తోంది. పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా వ్యవహరం ఉందని, ఎన్నికల సమయంలో రాజకీయాలు వేరుగా ఉండటం అన్ని పార్టీల్లో కామన్ అంశంగా నే చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరెవరు ఏ పార్టీ వైపు వెళుతున్నారని నిఘా పెడితే, ఆ విషయం తెలిసిన తరువాత సదరు నేతకు మరింత ఇబ్బంది ఉండటం కామన్ విషయంగా చెబుతున్నారు. నాయకులందరికి పాత పరిచయాలు ఉంటాయని అంత మాత్రాన సొంత పార్టీలోనే ఇలాంటి పరిస్దితులు క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తున్నారనే టాక్ కూడ ఉంది.