![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP High Court : ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !
ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ సాయాన్ని కొనసాగించాలని ఆదేశించింది.
![AP High Court : ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం ! The High Court has directed the AP government not to suspend aid to aided schools AP High Court : ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/02/a64fc44468d693a5c974dc9a4967c0b7_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎయిడెడ్ స్కూళ్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆపవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో కేసులు పరిష్కారం అయ్యే వరకూ ఎయిడెడ్ స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. గత విచారణలో ప్రభుత్వం తాము ఎయిడెడ్ కాలేజీలకు సాయం అపడం లేదని హైకోర్టుకు తెలిపింది. అయితే జీవోలో మాత్రం ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలని ఉంది. అదే సమయంలో స్వాధీనం చేయాలంటూ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందంటూ కొంత మంది ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read :బద్వేలు ఏకగ్రీవం అవుతుందా ? నామ మాత్రపు పోటీ జరుగుతుందా ?
పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఆర్‌జేడీలు, డీఈవోలకు ఆదేశాలివ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ప్రభుత్వం తాము ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని చెబుతున్నప్పటికీ.. అధికారులు యాజమాన్యాల నుంచి రాతపూర్వకంగా ఆస్తులతో సహా అప్పగిస్తారా? ఉపాధ్యాయుల్ని మాత్రమే ఇస్తారా? అనే అంశాలపై బలవంతంగా లిఖితపూర్వకంగా అనుమతి పత్రాలు తీసుకున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. వీటిపై తదుపరి విచారణలో హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా పలు ఎయిడెడ్ స్కూళ్లు మూతపడ్డాయి. ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం కోర్టులో చెబుతున్నది ఒకటి.. బయట అమలు చేస్తున్నది ఒకటన్న ఆరోపణలను యాజమాన్యాలు చేస్తున్నాయి.
Also Read :Janasena Vs BJP : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?
అయితే ఇప్పటికే జారీ చేసిన జీవోకు అనుగుమంగా తొంభై శాతం వరకూ ఎయిడెడ్ స్కూళ్ల వద్ద నుంచి ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అంగీకారపత్రాలు తీసుకోవడమో.. లేదా ప్రైవేటుగా నిర్వహించుకోవడమో చేయాలనే పత్రాలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రైవేటుగా నడపలేమనకుున్న విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇప్పుడు ప్రభుత్వం వాటికి ఎయిడ్ నిలిపివేయకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చినందున ఈ ఏడాది ఆయా స్కూళ్లలో మళ్లీ తరగతలు ప్రారంభమవుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ఇప్పటికే చాలా స్కూళ్లు తమ విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపేసినట్లుగాతెలుస్తోంది. మొత్తానికి ఏపీలో ఈ ఏడాది ఎయిడె స్కూళ్ల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ వైపు కరోనాతో.. మరో వైపు ఎయిడెడ్ వివాదంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)