అన్వేషించండి

Chandrababu case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ మళ్లీ శుక్రవారం - విచారణ వాయిదా !

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదించారు.


Chandrababu case :  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో   చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదాపడింది.  చంద్రబాబు తరఫున వా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. అత్యవసర కేసులు విచారణ ఉన్నందున మధ్యాహ్నం రెండు తర్వాత ఆ కేసులను ధర్మాసనం టేకప్ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

మొదటగా హరీష్ సాల్వే వాదనలు 

సోమవారం కోర్టు సమయం పూర్తయ్యే వరకూ విచారణ జరిగింది. మంగళవారం ఉదయమే విచారణ ప్రారంభణైన వెంటనే.. హరీష్ సాల్వేను ఎంత సేపు వాదనలు వినిపిస్తారని ధర్మాసనం అడిగింది. గంటసేపు అని చెప్పారు. ఆ మేరకు వాదనలు వినిపించారు.  రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ధర్మాసనం దృష్టికి  తీసుకెళ్లారు.  ‘‘రఫేల్‌ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్‌ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు.  అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్‌ 17ఎతో రక్షణ లభించింది’’అని  వాదించారు. వివిద హైకోర్టుల్లో వచ్ిచన తీర్పును ఉదహరించిన సాల్వే..     స్కిల్‌ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం కాదు. దాన్నే సవాల్‌ చేస్తున్నామని.. . అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నారు.   

ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు

2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు.  హైకోర్టులో విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.  2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని వాదించారు.  ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారని.. . కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలని వాదించారు.   నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపజేయకూడదన్నారు.  చట్టసవరణలతో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాదు.. ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలన్నారు. 

ప్రభుత్వం తరపు లాయర్‌కు ధర్మాసనం పలు ప్రశ్న

 ప్రభుత్వం తరపు లాయర్ ముకుల్‌ రోహత్గీకి పలు సందేహాలను వ్యక్తం చేసింది.  17A నేరానికి వర్తిస్తుందా ? నిందితులకు వర్తిస్తుందా? అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏమి కనిపెట్టారు ? అని ప్రశించారు. ‘అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా ?... మిగతా సెక్షన్ ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా ? లేదా ?’ అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. వాదనలు శుక్రవారం కొనసాగనున్నాయి. ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget