అన్వేషించండి

Andhra News : వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఏపీ నెంబర్ వన్ - లెక్కలు విడుదల చేసిన ప్రభుత్వం !

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రభుత్వం ప్రకటించింది.


Andhra News :  వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2022– 23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని అత్యధిక వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది.   20 సూత్రాల అమలు కార్యక్రమం  2022– 23 ఆర్థిక సంవత్సరం ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను పరిశీలిస్తే,  2022– 23 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 24,852 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,24,311  కనెక్షన్లను రైతులకు మంజూరు చేసింది. ఒక్క దరఖాస్తు కూడా పెండింగులో లేకుండా  దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. లక్ష పైగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం.  రైతు ప్రయోజనాల పరిరక్షణ పట్ల జగన్‌ సర్కారుకు ఉన్న ఎనలేని శ్రద్ధకు ఇది నిదర్శనమని విద్యుత్, వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,54,081 వ్యవసాయ పంపుసెట్లను విద్యుదీకరించాలని లక్ష్యం కాగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాపాలిత ప్రాంతాలు  7,35,338 కనెక్షన్లు జారీ చేశాయి. ఇందులో 1,24,311 కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే మంజూరు కావడం గమనార్హం.

44,770 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా  99,137 కనెక్షన్లు విడుదల చేసి రాజస్థాన్‌ రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.  25148కు గాను  89,183 వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో తృతీయ స్థానంలో నిలిచింది. 1,50,000 కనెక్షన్లు మంజూరు చేయాలని పంజాబ్‌ రాష్ట్రం లక్ష్యం కాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేవలం  524 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి ‘జీరో’ శాతం లక్ష్య సాధనలో ఉన్నట్లు కేంద ప్రభుత్వం పేర్కొంది. కేవలం 45 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి సంఖ్యాపరంగా పాండిచ్చేరి చిట్ట చివరి స్థానంలో ఉంది. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దరఖాస్తుదారులందరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని మార్గదర్శకం చేశారని, ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయనంద్ తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగులో పెడితే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగు దరఖాస్తులన్నింటినీ క్లియర్‌ చేయాలని ఆదేశించిందని ఆయన అన్నారు. దీంతో మౌలిక వసతులు కల్పించి మొత్తం 1,24,311 వ్యవసాయ పంపుసెట్లకు గత ఆర్థిక సంవత్సరం విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేసినట్లు తెలిపారు.. పెండింగు క్లియర్‌ చేసినందున ప్రస్తుతం దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలు చేస్తున్నామని వెల్లడించారు.

2022– 23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల జారీ వివరాలు  

రాష్ట్రం ...  లక్ష్యం .. మంజూరు
ఆంధ్రప్రదేశ్‌  24852  1,24,311
రాజస్థాన్‌   44770  99,137
తెలంగాణ   25148  89183
కర్ణాటక   38602  75117
ఉత్తరప్రదేశ్‌  22058  69201
బీహార్‌   2764  64768
ఛత్తీస్‌ఘడ్‌   21000  23188
గోవా   200  222
గుజరాత్‌   44500  65792
హర్యానా   8800  20056
హిమాచల్‌ప్రదేశ్‌  1458  4590
కేరళ   12000  16713
మధ్యప్రదేశ్‌  17237  10077
ఒడిశా   1190  18882
పాండిచ్చేరి  35  45
పంజాబ్‌   150000  524
తమిళనాడు  15000  50772
ఉత్తరాఖండ్‌  1000  2606
ఉత్తరప్రదేశ్‌  22058  69201

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget