Chandrababu : సినిమా పరిశ్రమ ఎప్పుడూ సహకరించలేదు .. టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని చంద్రబాబు విమర్శలు !

సినీ పరిశ్రమ టీడీపీకి ఎప్పుడూ సహకరించలేదని పైగా..తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఈ పేపర్ " చైతన్య రథం"ను ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు

FOLLOW US: 

టాలీవుడ్ సినీ పరిశ్రమపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ల వివాదంలో అనవసరంగా తెలుగుదేశం పార్టీని లాగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి సహకరించలేదన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడే కాదు ఇటీవల కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని.. ఇంకా తీస్తున్నారని గుర్తు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకపోయి ఉండే 2009లోనే అధికారంలోకి వచ్చి ఉండేవారమన్నారు. అయితే చిరంజీవి పార్టీ పెట్టినందువల్ల తమ వ్యక్తిగత సంబంధాలు ఏమీ మారలేదన్నారు. పార్టీ పెట్టక ముందు.. పెట్టిన తర్వాత.. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Also Read: 'మీరు టెంపరరీ ఎంప్లాయిస్... ఏరోజైనా తీసేయొచ్చు'... సచివాలయ ఉద్యోగులపై వ్యవసాయశాఖ జేడీ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల సినిమా టిక్కెట్ల వివాదం కారణంగా... టాలీవుడ్‌లో ఎక్కువగా టీడీపీ వాళ్లు ఉన్నారని అందుకే సీఎం జగన్  చిత్ర పరిశ్రమను టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అదే తరహా విమర్శలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు టాలీవుడ్ తమకు సహకరించిందేమీ లేదని ప్రకటించడం అనూహ్యంగా మారింది. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో సొంతంగా ఈ- పేపర్‌ను రూపొందిస్తున్నారు. ఈ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ పేపర్‌కు "చైతన్య రథం" అని పేరు పెట్టారు.  

Also Read: తగ్గేదే లే... జీతాలపెంపు కోసం రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు..

కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పనిచేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదనే విధంగా ప్రస్తుత అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. 60 శాతం మంది ప్రజలు సోషల్ మీడియాకు అలవాటు పడ్డారని తెలుగుదేశం పార్టీకి ఉన్న 70లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా "చైతన్య రథం" ఈ-పేపర్‌ను తీర్చిదిద్దుతామన్నారు. 

Also Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా.... ఈ నెల 18 నుంచి కర్ఫ్యూ అమలు... ఆంక్షల ఉత్తర్వుల్లో సవరణ చేసిన ప్రభుత్వం

వైఎస్ఆర్‌సీపీ అరాచక పాలన చేస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. వేల కోట్లు అప్పులు చేస్తున్నా.. కనీసం రోడ్లు కూడా వేయడం లేదని విమర్శించారు. అవినీతి పాలకు చరమగీతం పాడాల్సి ఉందన్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 05:32 PM (IST) Tags: ANDHRA PRADESH tdp Chandrababu naidu Chaitanya Ratham E paper Telugudesam E paper

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే

Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే

ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి

ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి

Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు

Nellore Pistol: నెల్లూరులో రెండు ప్రాణాలు తీసిన పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టిన పోలీసులు, కీలక విషయాలు

YSRCP MP Pilli Issue : ఆధారాలున్నాయన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ - చాన్సే లేదన్న ప్రభుత్వం ! ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ?

YSRCP MP Pilli Issue : ఆధారాలున్నాయన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ - చాన్సే లేదన్న ప్రభుత్వం ! ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

Whatsapp Premium: త్వరలో వాట్సాప్ ప్రీమియం - డబ్బులు కట్టాల్సిందేనా?

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!

NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!