అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra News : ఫైబర్ గ్రిడ్ కేసులో కీలక తీర్పు - ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు ఓకే !

Andhra News : ఫైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేయాలని సీఐడీ విజ్ఞప్తికి కోర్టు అంగీకారం తెలిపింది. ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల ఆస్తులను సీఐడీ జప్తు చేసింది.

 


Andhra News Fiber Net Case :    పైబర్ నెట్ కేసులో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో వివిధ ఆస్తులు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. సీఐడీ ఆస్తుల అటాచ్‌కు  హోంశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఆస్తుల అటాచ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది సీఐడీ. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు  ఏడు స్థిరాస్థులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.                        

ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కేసులో రూ.114 కోట్లు దుర్వినియోగం అయ్యాయని సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ 2గా టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపిచంద్, ఏ 25గా చంద్రబాబు పేర్లను సీఐడీ చేర్చింది.    తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీ ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సన్నిహితులకు లాభం చేకూర్చేలా ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయంలో వ్యవహరించారని సీఐడీ ఆరోపిస్తోంది.                                                  

అక్రమాలకు పాల్పడిన టెరాసాప్ట్‌తో పాటు వేమూరి హరిప్రసాద్‌కు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. వీటితోపాటు విశాఖపట్నం, గుంటూరుతో పాటు హైదరాబాద్‌లోని దాదాపు రూ.114 కోట్ల ఆస్తుల జప్తుకు సీఐడీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై కేసులు పెట్టడం, ఆస్తులను జప్తు చేయడం చేస్తోందని టీడీపీ మండిపడుతుంది.                                      

ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగలేదు. కానీ చంద్రబాబును 17-ఎ కేసులో తీర్పు వెలువరించేంత వరకూ ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్టు చేయడం కానీ, ట్రయల్‌ కోర్టు ముందు హాజరుపరచడం కానీ చేయొద్దని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన విచారణ జరగాల్సి ఉంది.  ఈ లోపే 17ఏపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget