Top Headlines Today: అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్! టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం
AP Telangana Latest News 10 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ - ఏపీ హైకోర్టు తీర్పు !
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు.ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మరో షాకిచ్చిన అంబటి రాయుడు - పవన్ కల్యాణ్‌తో భేటీ !
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా ప్రకటించారు అంబటి రాయుడు. కొంత కాలం రాజకీయాలకు విరామం తీసుకుంటానని చెప్పారు. అయితే హఠాత్తుగా ఆయన హైదరాబాద్ లో పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తనకు దుబాయ్‌లో లీగ్ లు ఉన్నాయని అందుకే రాజకీయాలకు విరామం ప్రకటించానని అన్నారు. కానీ అది అబద్దమని పవన్ తో భేటీ ద్వారా క్లారిటీ వచ్చినట్లయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాల ఆమోదం
టీఎస్‌పీఎస్సీ (TSPSC) చైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాలను(Resignations) గవర్నర్ తమిళి(Governor Tamilisai)సై బుధవారం ఆమోదించారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్,సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తే.. కొత్త బోర్డును ఏర్పాటు చేసి.. ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ క్రమంలో గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్ హైకమాండ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) ఢిల్లీ (Delhi)కి వెళ్లారు. కాంగ్రెస్ (Congress)హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన హస్తినకు వెళ్లారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revnath Reddy)తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి (Sangareddy)నుంచి భవిష్యత్ లో పోటీ చేసేది లేదని చెప్పారు. అయితే మెదక్ పార్లమెంట్ టికెట్ ను తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమార్తె జయారెడ్డి కోసం టికెట్ అడుగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీలోకి ఎంపీ కేశినేని నాని, సాయంత్రం సీఎం జగన్ ను కలిసే ఛాన్స్!
విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని నాని వైసీపీ (YSRCP)లో చేరిక ఖాయమైంది. ముఖ్యమంత్రి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)ని ఇవాళ సాయంత్రం కలవనున్నారు. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేశారు. కేశినేని నాని ఎంపీ పదవికి, ఆయన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవికి గుడ్ బై చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















