అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anticipatory bail for Chandrababu : అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ - ఏపీ హైకోర్టు తీర్పు !

AP High Court : అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీహైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.


High Court granted anticipatory bail to Chandrababu in all cases :  చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అన్ని కేసుల్లోనూ ముందస్తు  బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు.ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ వరుసగా కేసులు నమోదు చేసింది.                                 

ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.            

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు  బెయిల్ పిటిషన్ పై గతంలో హైకోర్టు విచారణ జరిపి తిరస్కరించింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. దీనిపై  సుప్రీంకోర్టులో  చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవవాల్సి ఉన్నందున విచారణ జరగడం లేదు. కానీ ఆ కేసులో అరెస్టులు చేయవద్దని స్పష్టం చేసింది.                                     

సీఐడీ తనపై నమోదు  చేసిన కేసులు పూర్తిగా కుట్ర పూరితమని .. ఒక్క సాక్ష్యం లేకండా..   తప్పుడు ఆరోపణతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తనపై కేసులు నమోదు చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని తనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని.. చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత   క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది.  చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఏపీ సర్కార్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అక్టోబర్ 18వ తేదీన ఈ క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ చేశారు. ఇంత కాలం తీర్పు వెల్లడించలేదు. ఎప్పుడు వెల్లడిస్తారో స్పష్టత లేదు.ఈ లోపు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది.           

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget