Breaking News: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ నిరసనలు... పలువురి అరెస్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ట్యోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్ టెన్నిస్ విభాగంలో భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో చైనా క్రీడాకారిణిపై భవీనాబెన్ విజయం సాధించింది. జాంగ్ మియావోపై 3-2 తేడాతో ఓడించింది. ఫైనల్‌కు చేరిన భవీనా భారత్‌కు పతకాన్ని ఖరారు చేసింది. పోలియో జయించిన భవీనాబెన్ పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచారు.
తెలంగాణలో 325 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 325 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,57,119కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 3,869కి చేరింది. నిన్న కోవిడ్ బాధితుల్లో 424 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో రికవరీల సంఖ్య 6,47,185కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 6,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం బులెటిన్ విడుదల చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై టీడీపీ ధర్నా.. పలువురు అరెస్ట్
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తెదేపా నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలను గృహనిర్బంధం చేశారు. అనేకచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆందోళనలను అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనపై IPC 306, 511 సెక్షన్స్ పెట్టడంపై తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఫిర్యాదుదారు ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలిస్తామని కోర్టు న్యాయమూర్తి తెలిపారు. తీన్మార్ మల్లన్న తరఫున వాదిస్తున్న ఉమేష్ చంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని తీన్మార్ మల్లన్నను ఏడు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అభ్యర్థించారు.
సెక్రటేరియట్‌లో ఆఫీసులు ఎక్కడున్నాయో సీఎంకు తెలుసా?
‘‘తెలంగాణలో సెక్రెటేరియట్‌లో ఉన్న వివిధ శాఖల ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు తెలుసా? ఆ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన చెప్పాలని నేను సవాలు చేస్తున్నా.. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా సెక్రటేరియట్‌కి వెళ్లని ముఖ్యమంత్రిని మీరెక్కడైనా చూశారా? రాష్ట్రంలో ఒక నీతిమంతమైన పాలన రావాల్సిన అవసరం ఉంది.’’ అని కిషన్ రెడ్డి మాట్లాడారు.
కల్వకుంట్ల కుటుంబమే బంగారంగా మారింది: కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగస్థులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుంది. బంగారు తెలంగాణ అంటారు.. కానీ అప్పుల తెలంగాణగా మార్చారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారంగా మారింది. రూ.లక్షల కోట్లను పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాలు రెండింటింకే ప్రజలు రాష్ట్రాన్ని దత్తత ఇచ్చారు. వారే ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.’’ అని అన్నారు.