అన్వేషించండి

Varla Ramaiah : జగన్‌ కేసులను ఈడీ ఎందుకు పట్టించుకోదు ? - టీడీపీ ప్రశ్న

TDP : 8 ఎకరాల అంశంపై ఈడీ ఝార్ఖండ్ సీఎంను అరెస్ట్ చేస్తే 43 వేల కోట్ల అవినీతిని చేసిన జగన్‌ను ఎందుకు వదిలేశారని టీడీపీ ప్రశ్నించింది. జగన్ పదవిలో ఉండటానికి అనర్హుడని వర్ల రామయ్య స్పష్టం చేసారు.

TDP Varla Ramaiah :  8 ఎకరాల పొలం అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎంను అరెస్టు చేశారు, 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు అరెస్టు చేయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించారు.  మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో  వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. 

ఈడీకి జగన్ అవినీతి ఎందుకు కనిపించడం లేదు ? 
 
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు పడడంలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ ది విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వం. ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హేతువాదులు అడిగిన ప్రశ్నలకు జగన్ ఏనాడూ సమాధానం చెప్పలేదు. మేం ఏదైనా అడిగితే కాదు అని ఆయన గాని, ఆయన అనుయాయులుగానీ చెప్పరు. జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని రూ.43 వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ జగన్ పై 11 ఛార్జిషీట్లు వేసింది. ఈ ఛార్జిషీట్లు రికార్డు పరంగా నమోదయ్యాయి. కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకొంది. అన్నింటికి కేలెండర్ నెంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో 31.03.2012న ఛార్జిషీట్లు వేశారు. జగన్ పై ఛార్జిషీట్లు వేసి 11 సంవత్సరాలైంది. ఆయన పై ఉన్న కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. 

జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని 43వేల కోట్లు దోపిడి

జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని రూ.43 వేల కోట్లు  కొట్టేసినట్లు సీబీఐ చెప్పకనే చెప్పింది. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ 5 కేసులు నమోదు చేసి ఛార్జిషీట్లు వేశారు రూ.2 వేల కోట్ల పైచిలుకు ఆస్తులు స్వాధీనపరచుకున్నారు.  8 ఎకరాల పొలం బిట్లు బిట్లుగా 10, 15 సెంట్లు చేసి అన్యాక్రాంతం చేశాడని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అరెస్టు చేశారు. అప్పటికప్పుడు ఆయన చేత సీఎం పదవికి రాజీనామా చేయించారు. సెంట్రల్ జైలుకు పంపారు. ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ శాఖను నేను అభినందిస్తున్నాను. ఇందులో భాగంగానే మ  సీఎం జగన్ వైపు కూడా ఒక సారి చూడాలి. నేరం చేసినవాడు ఎంతటివారైనా చట్టం వదలదని దీని ద్వారా అవగతమైంది. 11సీబీఐ ఛార్జిషీట్లు, 5 ఈడీ కేసులు, రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు, 2 వేల కోట్ల పైచిలుకు  సాక్ష్యాలున్న సీఎం జగన్ ను ఎందుకు వదిలేశారు? 4 సంవత్సరాల 10 నెలలుగా జగన్ సీఎంగా ఉన్నారు, అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ చూపు ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైపు పడడంలేదు? ఎన్ ఫోర్స్ మెంట్ చూపు పడని సేఫ్ ప్లేస్ లో జగన్ ఉన్నారా? దీనికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
  
2004లో 2.12 కోట్లు ఉన్న ఆస్తులు2009లో 77 కోట్లు ఎలా అయ్యాయి?

2004లో తండ్రి ముఖ్యమంత్రి కాకముందు జగన్ ఆస్తులు 2.12 కోట్లు అన్నారు.  2009 ఎన్నికల అఫిడెవిట్ లో తన  ఆస్తి రూ.77 కోట్ల 40 లక్షలకు ఎలా ఎగబాకింది? నాలుగు సంవత్సరాల్లో ఇది అనితర సాధ్యమా? ఏ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పరు. గతంలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయం నుండి రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇదీ ప్రశ్నలు పలు దఫాలుగా అడగడం జరిగింది. వ్యాపారం చేసినట్లుగానో, కాయాకష్టం చేసినట్లుగానో, కంపెనీలు నడిపినట్లుగానో చెప్పాలిగదా! రూ. 77 కోట్లు ఎలా వచ్చిందో చప్పడట.. ఆస్తులొచ్చాయట.. ఎలా వచ్చాయో చెప్పరట.. ఇది పద్ధతేనా? మౌనం అర్ధాంగికారమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి చేసి సంపాదించిన డబ్బు అని నేనంటే అది అంగీకరించినట్లు కాదా? మీరు శిక్షకు అర్హులేకదా? ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవరమా? నేనడిగిన ప్రశ్నలకు సమాధానం ప్పకపోతే ప్రజా క్షేత్రంలో జగన్ తప్పుడు మనిషేగా? అతి కొద్ది కాలంలోనే జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలా రూపాంతంరం చెందారు? 

లోటస్ పాండ్ మీదా? కాదా? మీదైతే మీకెక్కడిది?

29 ఎకరాల్లో అమెరికా శ్వేత తలదన్నే సౌధం బెంగళూరులో ఎలా నిర్మించగలిగారు? జగనన్న విడిచిన బాణం నేడు ఏమైంది? ఎందుకు ఎదురుతిరిగిందో చెప్పగలరా? బాబాయి హత్య కేసులో సీబీఐ విచారణ అడిగిన మీరు, తర్వాత హైకోర్టు నుండి దానిని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కోడికత్తి శీను ను మీ కుట్రలో పావుగా వాడుకొని 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా ఎందుకుంచారో చెప్పగలరా?  జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో కూడా మనీ ల్యాడరింగ్ చేశారని లెటర్స్ ఆఫ్ లేబొరేటరీ 6 దేశాలు వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ లాంటి 6 దేశాలకు పంపారు. ఈ 6 దేశాల్లో ఈ మనీ ల్యాండరింగ్ జరిగినట్లు సుస్పష్టంగా తేలింది. ఈ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఏం చేర్యలు తీసుకున్నారో చెప్పాలి. సోరెన్ అవినీతి కనిపించిన ఎన్ ఫోర్స్ మెంట్ కు జగన్ అవినీతి ఎందుకు కనబడలేదు? 

జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడలేదా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బడా బడా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ పరంగా రాయితీలిచ్చారు. ఎకరం 50 లక్షలు చేసేదాన్ని ఎకరం 50 వేలకు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వాన్ పిక్ కు 28 వేల ఎకరాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉన్నాయి. ఈ 28 వేల ఎకరాలు స్వీకరించినవారు జగన్మోహన్ రెడ్డికి జగతి పబ్లికేషన్, సాక్షి పేపర్ లో 8 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం వాస్తవం కాదా? ప్రపంచ వ్యాప్తంగా పత్రికా రంగం లాభసాటి వ్యాపారం కాదు, జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు లాభసాటి అయింది. ఇంతకంటే రుజువులు ఏంకావాలి? కన్నతల్లిని సరిగా చూసుకోనివాడు, పట్టెడన్నం పెట్టనివాడు పినతల్లికి బంగారు గాజులు పెడతానంటే ఎవరైనా నమ్మగలరా? జగన్ పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది.  జగన్ రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. రాజకీయాలకు పనికిరారు. ఎప్పటికైనా జగన్ కేసులపై కోర్టుల్లో తీర్పు వస్తుంది. జగన్ కోర్టు కేసుల్లో హాజరు కావాలని సూచిస్తున్నాను. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నిజా నిజాలు బయటపడతాయి. ఇప్పటికైనా జగన్ విపరీతమైన, విచిత్రమైన మనస్తత్వాన్ని వదలి తాము అడిగే ప్రశ్నలకన్నింటికి సమాధానాలు చెప్పాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget