Chandrababu Security : చంద్రబాబు ప్రాణాలపై కుట్ర - ప్రభుత్వంపై యనమల, అచ్చెన్న తీవ్ర ఆరోపణలు
చంద్రబాబు ప్రాణాలపై ప్రభుత్వమే కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. జైల్లో మనుషుల్ని చంపడంలో జగన్ అండ్ టీం నిపుణులని మండిపడ్డారు.
Chandrababu Security : చంద్రబాబు ప్రాణాలకు ప్రభుత్వ పెద్దలే ముప్పు తెచ్చి పెడుతున్నారని.. జైల్లో భారీ కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. తనకు సరైన భద్రతలేదని స్వయంగా చంద్రబాబునాయుడు, ఏసీబీ కోర్టు న్యాయ మూర్తితో చెప్పాక, న్యాయమూర్తి తగిన భద్రత కల్పించాలని ఆదేశించాక కూడా జైలు అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాజకీయ కుట్ర కాక మరేమిటని యనమల రామకృష్ణడు ప్రశ్నించారు. జైలుపై గతంలో డ్రోన్ తిరిగింది. ఎలాంటి విచారణ చేపట్టలేదు. చంద్రబాబు హెల్త్ బులెటి న్ కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధృవీకరించిన రిపోర్టుని మాత్రమే మీడియాకు చూపిస్తున్నారని దీని వెనుక కూడా కుట్ర ఉందన్నారు. చంద్రబాబుకి జైల్లో తగిన భద్రత కల్పించారా లేదా అనేదానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిశీలించాలన్‌నారు. చంద్రబాబు లాంటి నాయకుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆలోచించాలని ఒక సాధారణ పౌరుడిలా విజ్ఞప్తి చేస్తున్నామని యనమల తెలిపారు.
అధికారంకోసం సొంత బాబాయ్ చంపించిన వ్యక్తికి ఇతరులంటే లెక్క ఉంటుందా?
చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేకనే జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేతను అన్యాయంగా జైలుకు పంపాడని యనమల రోపించారు. కుట్రలు, కుతంత్రాలు, దురాలోచన గల నాయకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీనే లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడని మండిపడ్డారు. సొంత బాబాయ్ ని అధికారంకోసం చంపించిన వ్యక్తికి ప్రతిపక్షాలన్నా.. ప్రధాన నాయకులన్నా లెక్క ఉంటుందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై కక్ష గట్టి యువతకు అన్యాయం
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి పేదలు, బలహీన వర్గాలకు ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా చంద్రబాబు చేశారన్నారు. ఇలాంటి ప్రాజెక్టు తన కక్షలకు బలి చేసిన జగన్ రెడ్డి, చివరకు యువతకు ఎలాంటి శిక్షణ లేకుండా చేశాడన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు నాటి ప్రభుత్వం విడుదలచేసిన ప్రతిరూపాయి అసెంబ్లీ ఆమోదంతోనే ఇవ్వడం జరిగిందన్నారు. మొదట వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు... తరువాత రూ.370 కోట్లు చంద్రబాబు కాజేశాడ న్నారు... న్యాయస్థానాల్లో చంద్రబాబుకి డబ్బులు అందినట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఇప్పుడు రూ.27కోట్లు అంటున్నా రు. ఆ సొమ్ముకూడా ఎక్కడిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పొందడం కోసం కార్యకర్తలు చెల్లించిన సొమ్ము. దాదాపు 40 సంవత్సరాల నుంచి నడుస్తున్న పార్టీకి వచ్చిన విరాళాలు తప్పు అంటున్నారని మండిపడ్డారు.
మొత్తం సజ్జల కనుసన్నల్లోనే !
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఎక్కడా..ఎలాంటి తప్పు జరగలేదని అవినీతికి ఆస్కారమే లేదని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. కేవలంరాజకీయ కుట్రలో భాగంగ చంద్రబాబుని ఏదోరకంగా ఇబ్బందిపెట్టాలి.. ఆయన ప్రాణాలకు ప్రమాదం కలిగించాలనే కుట్రపూరిత ఆలోచనల్లో భాగంగానే పాలకులు ఇలా వ్యవహరిస్తున్నారని ారోపించారు. చంద్రబాబు పేరుకే జైల్లో ఉన్నారు కానీ.. కచ్చితంగా గమనిస్తే ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్టు అర్థ మవుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే చంద్రబాబుకి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తున్నారని యనమల ఆరోపించారు. . చంద్రబాబుని జైలుకు పంపిన దగ్గరనుంచీ గమనిస్తే అటు జైలు అధికారులు.. ఇటు వైద్యులు.. ఇతర అధికారులు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో కూడా సజ్జలే నిర్ణయిస్తున్నాడు. వీలైనంత త్వరగా చంద్రబాబుకి తగిన భద్రతతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించాలని యనమల కోరారు.
జైల్లో ఉన్న వ్యక్తులను చంపడంలో జగన్ అండ్ టీమ్ నిపుణులు : అచ్చెన్న
జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారు.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో మాలో ఆందోళన కలుగుతోందన్నారు. జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా.. విచారణ లేదని.. చంద్రబాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే లేఖలు వచ్చినా విచారణ జరపడం లేదన్నారు. జైల్ లోపల నుంచి ఫొటోలు వస్తున్నా ఎలాంటి చర్యల్లేవని అచ్చెన్న మండిపడ్డారు. చంద్రబాబు జుడిషియల్ కస్టడీలో ఉంటే ప్రభుత్వానికేం సంబంధం.. సజ్జల డైరెక్షన్లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం కూడా మాకు మరింత ఆందోళన కలుగుతోందన్నారు. గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశ్యాలు బయట పడుతున్నాయన్నారు.