TDP leader Pattabhi On Ashok Babu Arrest: వైఎస్ జగన్‌గారు మీ టైమింగ్ సూపర్, అందులో మిమ్మల్ని మించినోళ్లు లేరు
Pattabhi On Ashok Babu Arrest: ఏపీ సర్కారుకు ఉద్యోగ సంఘాలు సమ్మె సరైన నోటీసు ఇచ్చినందుకు అదే రోజు పరుచూరి అశోక్ బాబుపై కేసు నమోదు కావడానికి అర్థం ఏంటని టీడీపీ నేత పట్టాభి రామ్ ప్రశ్నించారు.
![TDP leader Pattabhi On Ashok Babu Arrest: వైఎస్ జగన్‌గారు మీ టైమింగ్ సూపర్, అందులో మిమ్మల్ని మించినోళ్లు లేరు TDP leader Pattabhi Ram Slams AP CM YS Jagan Over MLC Ashok Babus Arrest TDP leader Pattabhi On Ashok Babu Arrest: వైఎస్ జగన్‌గారు మీ టైమింగ్ సూపర్, అందులో మిమ్మల్ని మించినోళ్లు లేరు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/41c517ff3cf5093faff204d825d6e64b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP leader Pattabhi Slams AP CM YS Jagan: ఏపీ ప్రభుత్వం కష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో టీడీపీ సీనియర్ నేతల్ని అరెస్ట్ చేయడం, వేధించడం లాంటివి చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, నిరుద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం మోసిం చేసిందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఏపీ ఉద్యోగులు ఛలో విజయవాడ అని కదం తొక్కి నైతిక విజయం సాధించారు. తమ పీఆర్సీ, ఐఆర్, జీతాల పెంపు విషయంలో వారి పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా చేసిన అశోక్ బాబు ఉద్యోగుల తరఫున ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై ప్రభుత్వం ఆయనపై కక్ష గట్టిందన్నారు.
వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యమనేత, ఏపీ ఎన్టీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును తెలుగుదేశం పార్టీ గౌరవించింది. ఎమ్మెల్సీగా అవకాశ దక్కడంతో విద్యార్థుల తరఫున, ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి రివర్స్ పీఆర్సీపై అశోక్ బాబు మీడియాతో పలుమార్లు మాట్లాడిన సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఆయనపై కక్ష గట్టిన ఏపీ ప్రభుత్వం ఆయనను వేధించడంలో భాగంగా నిన్న అర్థరాత్రి అశోక్ బాబును అరెస్ట్ (TDP MLC Ashok Babu Arrest) చేశారు. ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తూ అశోక్ బాబును అదుపులోకి తీసుకున్నారని పట్టాభి రామ్ తెలిపారు.
పెళ్లికి హాజరై ఇంటికి వచ్చిన నేతను అధికారులు అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కార్యాయానికి తరలించారు. అశోక్ బాబుపై ఈ జనవరి 24న సాయంత్రం 6 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదుచేశారని.. జగన్ ప్రభుత్వం సమస్యలు ఉత్ఫన్నమైన సందర్భంలో తప్పుడు పనులు చేస్తుందనే దానికి ఇది నిదర్శనం అన్నారు. ఏపీ సర్కారుకు ఉద్యోగ సంఘాలు సమ్మె సరైన నోటీసు ఇచ్చినందుకు అదే రోజు పరుచూరి అశోక్ బాబుపై కేసు నమోదు కావడానికి అర్థం ఏంటని ప్రశ్నించారు. జనవరి 24న రివర్స్ పీఆర్సీ (AP PRC Issue)పై ఉదయం ఉద్యోగులు సమ్మె నోటీసు ఇస్తే.. సాయంత్రం ఉద్యోగ సంఘాల మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని ఎద్దేవాచేశారు.
పోలీసులు, సీఐడీ సైతం ఏపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని విమర్శించారు. మూడు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా.. అరెస్ట్ సమాచారం అని అశోక్ బాబు ఇంటికి అంటించిన నోటీసులో అదనంగా నాలుగు సెక్షన్లు చేరాయని తెలిపారు. 466, 467, 468, 471 సెక్షన్లను అరెస్టుకు ముందు నోటీసులో చేర్చారని దీని ఉద్దేశం ఏంటన్నది ఏపీ ప్రజలకు కూడా తెలుసునని పట్టాభిరామ్ అన్నారు. 467 సెక్షన్ పెట్టడానికి కారణంగా సుదీర్ఘకాలం జైలుశిక్ష వేయించడం కుట్రలో భాగంగా అశోక్ బాబుపై తప్పుడు కేసులు బనాయించారనడానికి నిదర్శనమని టీడీపీ నేత పట్టాభి రామ్ వివరించారు. విద్యార్థతలకు సంబంధించిన సర్టిఫికెట్లు సరైనవేనని, ఎలక్షన్ అఫిడవిట్‌లో తాను ఇంటర్ పాసయ్యానని తెలిపారని చెప్పారు. కానీ గ్రాడ్యుయేట్ పాస్ అయ్యారని సర్టిఫికెట్లు ఇచ్చారని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సీఐడీ, పోలీసుల తీరును ఖండించారు. ఫోర్జరీ కేసు కాకున్నా ఆ సెక్షన్లు కూడా నమోదు చేశారని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: MLC Ashok Babu Arrest: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్, సీఐడీ ఆఫీసుకు తరలించిన అధికారులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)