Kuna Ravikumar: టీడీపీ నేత కూన రవి కుమార్ అరెస్టు.. అర్ధరాత్రి ఇంటికెళ్లి బలవంతంగా తలుపులు తెరిచి...
అర్ధ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున రవి నివాసానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు.
టీడీపీ నేత కూన రవికుమార్‌ను శనివారం అర్ధ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నిరసనల సందర్భంగా నిన్న కూన రవికుమార్‌ను పోలీసులు గృహా నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు, రవి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కూన రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం 2 టౌన్ సీఐ ప్రసాదరావుపై దుర్భాశలాడారంటూ కేసు నమోదు చేశారు. ఆయన అర్ధ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున రవి నివాసానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కూన రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై శాసన సభలో వైఎస్ఆర్ సీపీ శాసన సభ్యులు చేసిన వ్యాఖ్యలు సరికాదని ప్రభుత్వ మాజీ విప్, టీడీపీ నాయకుడు కూన రవికుమార్ శనివారం మండిపడ్డారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించడానికి బయలు దేరగా.. కూన రవికుమార్ ను ఆయన ఇంటివద్దే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read: క్లీనెస్ట్ సిటీగా ఇండోర్.. టాప్ 5లో విజయవాడకు చోటు.. ఏపీకి అవార్డుల పంట
ఈ సందర్భంగా పోలీసులకు కూన రవికుమార్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను అవహేళన చేసిన నీచ సంస్కృతి వైఎస్ఆర్ సీపీకే దక్కిందని అన్నారు. మహిళా లోకానికి మచ్చతెచ్చే రీతిలో చట్ట సభలో మాట్లాడడం విచారకరమని ఇదేనా మహిళా సాధికారత అని ప్రశ్నించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మహిళలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే వివేకా హత్యపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన సవాలు విసిరారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం అనర్హుడని అన్నారు.
చంద్రబాబు తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా అని కూన రవి కుమార్ ప్రశ్నించారు. బాబు కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని కౌరవులు మాదిరిగా వైఎస్ఆర్ సీపీ నేతలకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గెలుపు కోసం అంతా కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు