By: ABP Desam | Updated at : 28 Apr 2023 03:30 PM (IST)
అక్రమ మైనింగ్‌లో సీఎం జగన్ హస్తం ఉందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు
Andhra News : గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చెబ్రోలు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఆక్రమ గ్రావెల్ మైనింగ్ లో సీయం జగన్ హస్తం ఉదని ఆరోపించారు పొన్నూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎంఎల్‌ఏ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్. స్థానిక ఎంఎల్ఏ ని సియం పిలిపించి పలుమార్లు మాట్లాడింది సెటిల్మెంట్ కోసమేనని తీవ్ర ఆరోపణ చేశారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి 200 కోట్ల టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించారుని ఆరోపించారు. చేబ్రోలు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలో దాదాపు 500ఎకరాల పరిధిలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్పష్టంచేశారు. మొత్తం 6 గ్రామాల పరిధిలో తవ్వకాలు జరుగుతున్నాయని.. పలు సందర్బాలలో
గ్రావెల్ తరలింపు వాహనాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకొన్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు ధూళిపాళ్ళ.
గ్రావెల్ తవ్విని తర్వాత ఏర్పడిన గుంటలో నిరు చేరడం వల్ల ప్రమాదవశాత్తూ ఆ గుంటలలో పడి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. స్థానికులు ఆందోళన చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదుని అధికారులలో చెలనం లేదన్నారు. పోలీసుల అండదండలతో గ్రెవల్ మాఫియా దందా చేస్తుదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కనులన్నలలో గ్రావెల్ మైనింగ్ జరుగుతోందిని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగే అవకాశం లేదు న్నారు. టన్ను రూ.110 చొప్పున ఆ ప్రాంతంలో తవ్విన గ్రావెల్ విలువ 2వేల 200 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు.
కలెక్టర్ తో సహా అధికారులకు దీనిపై ఫిర్యాదు చేసినా సరైన స్పందన లేదుని తెలిపారు.దీన్ని బట్టి ముఖ్యమంత్రి కి ఈ విషయంలో సంబంధం ఉందని తెలుస్తోందని ఆరోపించారు.. స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య మూడుసార్లు సీఎంను కలిశారని. కప్పం కట్టించి కోవటానికే సీఎం ఎమ్మెల్యేను పిలిపించారని అర్థమవుతోందిని అన్నారు. తవ్వకాలు అడ్డుకుని ఆందోళన చేసిన వారిని పోలీసులు అర్థరాత్రి సమయంలో తుపాకుల తో బెదిరిస్తున్నాని.. పంచాయతీ చెరువులను కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీస నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం లోతుకు తవ్వుతున్నా పట్టించుకొవడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉంది తెలిపారు ధూళిపాళ్ళ నరేంద్ర. పులివెందులలో జగన్ కార్యాలయంలో పని చేసే జి. రవి కృష్ణ అనే వ్యక్తి ఇందులో ఉన్నారుని.. ఐడి కార్డు పట్టుకుని మరీ వచ్చి చేబ్రోలు మండలంలో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారన్నారు. తప్పన్సరి పరిస్థితిలో మైనింగ్ అధికారులు దాడులు చేసినా పట్టించుకోవడం లేదని..గ్రావెల్ దోపిడి ఆగటం లేదన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం అని చెప్పి తవ్వి తరలిస్తున్నారుని తెలిపారు. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా తవ్వకాలు చేస్తున్నారు..అధికారులమౌనం, సహకారం వల్లే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలవరం కుడికాలువ మట్టి తవ్వారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది అయినా తవ్వకాలు ఆగటం లేదంటే ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్లేనన్నారు.
AP News: సంచలనం - ఆస్తులను వెల్లడించిన ఏపీ సమాచార చీఫ్ కమిషనర్ మహబూబ్ బాషా
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Top 5 Headlines Today: ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు! ఇటు కాంగ్రెస్ తో పొత్తులు ఫైనల్ అవుతున్నాయా ?
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?