(Source: Poll of Polls)
Jagan Reaction : టీడీపీది హైడ్రామా..చంద్రబాబు కుటుంబాన్ని ఏమీ అనలేదన్న సీఎం జగన్ !
చంద్రబాబు కుటుంబాన్ని ఏమీ అనలేదని సీఎం జగన్ అన్నారు. టీడీపీది హైడ్రామా అని అసెంబ్లీలో పేర్కొన్నారు.
చంద్రబాబు చెబుతున్నట్లుగా ఆయన కుటుంబంపై ఎవరూ మాట్లాడలేదని కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు.. తన రాజకీయ అజెండానే ఆయనకు ముఖ్యం అని విమర్శించారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును వ్యతిరేకించారని ... శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పడిపోయిందన్నారు. మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారని అన్నారు.
Also Read : మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వెళ్తా.. కుటుంబాన్ని అవమానించారని విలపించిన చంద్రబాబు !
ప్రతీ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తారని ఆయన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని..సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి తమ సభ్యులను రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం తమను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి తన చిన్నాన్న అన్నారు. ఓ కన్ను నాన్న అయితే మరో కన్ను చిన్నాన్న అన్నారు జగన్. ఒక కన్ను ను మరో కొన్ను ఎందుకు పొడుచుకుంటుందని ప్రశ్నించారు. నా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసుంటే చంద్రబాబే చేసుండాలన్నారు. వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. మల్లెల బాబ్జీ తన సూసైడ్ నోట్‌లో కూడా రాశారని జగన్ వ్యాఖ్యానించారు.
Also Read: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం
ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతు సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నేరవేర్చామని జగన్ తన ప్రసంగంలో తెలిపారు. టీడీపీ సభ్యులు వెెళ్లిపోయిన తర్వాత పలువురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. అప్పుడు కూడా ఘాటుగానే విమర్శలు చేశారు.
Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్