అన్వేషించండి

AP Volunteers Issue : సచివాలయాల సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ పంపిణీ - మరి వాలంటీర్లను ఏం చేస్తారు ?

Andhra News : ఏపీలో పెన్షన్లు పంపిణీని వాలంటీర్లతో చేయించకూడదని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ సిబ్బందితోనే పంపిణీ చేయబోతున్నారు. మరి వాలంటీర్లను ఏం చేస్తారు ?

AP Volunteers   :    ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల భవితవ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కోడ్ ఉన్న కారణంగా గత నాలుగు నెలలుగా వారు పెన్షన్ పంపిణీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పెన్షన్లను సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరి వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. 

సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు

ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పించన్లు పొందే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని.. ఒకటో తేదీన ఉదయమే సచివాలయాల సిబ్బంది వచ్చి వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారు. వచ్చే నెల అంటే జూలై ఒకటో తేదీన ఒక్కో పెన్షన్ లబ్దిదారునికి ఏడు వేలు ఇస్తారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నాలుగు వేల చొప్పున ఇస్తారు. గతంలో వాలంటీర్లు ఉదయమే వచ్చి పెన్షన్లు పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి పెన్షన్ల విషయంలో వాలంటీర్ల  ప్రమేయం లేకుండా చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు.  

ప్రతి 2వేల మంది జనాభాకు ఓ సచివాలయం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల వ్యవస్థను.. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్లు ప్రధానంగా వృద్ధుల పెన్షన్ ను పంపిణీ చేస్తూంటారు. ఇక నుంచి ఈ బాధ్యతను గ్రామ సచివాలయ ఉద్యోగులు నిర్వర్తిస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న
 సమయంలో మెజారిటీ కలెక్టర్లు సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్లు ఇవ్వవచ్చని అప్పటి ప్రభుత్వానికి సూచించారు. అయితే అప్పటి ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు చంద్రబాబు  ప్రతి సచివాలయం పరిధిలోనూ ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని నిర్ణయంచారు. గ్రామ సచివాలయాల్లో  పది మంది ఉద్యోగులు  తమ  పరిధిలోని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంటుంది. 

వాలంటీర్ల భవిష్యత్తేమిటి ?

వాలంటీర్ల భవిష్యత్ ఏమిటన్నదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జీతం పదివేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో సగానికిపైగారాజీనమా చేశారు. వారంతా ఇప్పుడు మళ్లీ తమను తీసుకోవాలని కోరుతున్నారు. బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వాలంటీర్ల ప్రధాన విధి పెన్,న్లు పంపిణీ చేయడం. అది కూడా సచివాలయ ఉద్యోగులకే ఇవ్వడంతో వాలంటీర్లను ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వారిని విధుల నుంచి తప్పించడంతో అప్పటి నుంచి వారికి పని లేదు. జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లకు ఇంకా ఏ పని చెప్పడం లేదు. పెన్షన్ల పంపిణీ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో వాలంటీర్లు కనిపిస్తున్నారు.                                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
TDP Polit Bureau: కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
A.I Effect: ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక  సర్వే
ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక సర్వే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP DesamUnion Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
TDP Polit Bureau: కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
కడపలో మహానాడు - జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు
A.I Effect: ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక  సర్వే
ఏఐతో దిగువ, మధ్య తరగతి ఉద్యోగులపై ప్రభావం - భయపెడుతున్న ఆర్థిక సర్వే
GBS News: తెలంగాణలో జీబీఎస్‌ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్ 
తెలంగాణలో జీబీఎస్‌ కేసు- ప్రభుత్వం హైఅలర్ట్ 
Revanth counter to KCR: గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!
గట్టిగా కొడతవా.. సరిగ్గా నిలబడు చూద్దాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు కౌంటర్!
KCR statement: గట్టిగా కొట్టడం నాకు అలవాటు - ఇక కాంగ్రెస్ పాలనపై దండయాత్రే - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
గట్టిగా కొట్టడం నాకు అలవాటు - ఇక కాంగ్రెస్ పాలనపై దండయాత్రే - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Thandel: 'తండేల్‌' టీం భారీ ప్లాన్‌  - హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా ఏర్పాట్లు, చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే!
'తండేల్‌' టీం భారీ ప్లాన్‌  - హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా ఏర్పాట్లు, చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే!
Embed widget