అన్వేషించండి

Chandrababu And Pawan Kalyan: ఏ క్షణమైనా ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ - కొలిక్కి వచ్చిన పొత్తుల లెక్కలు

Andhra Pradesh: మరో వారం పదిరోజుల్లో ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశమున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన స్పీడ్ పెంచాయి. బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటనకు రెడీ అయ్యాయి.

TDP Janasena BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడం తరువాయి అని రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో పొత్తులపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనకు వెళ్లేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఇరువురు ఉండనున్నారు. బీజేపీ అధినాయకత్వంతో పొత్తులపై చర్చించనున్నారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి పొత్తులపై చంద్రబాబు, పవన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చింది. ఇటీవల టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా బీజేపీతో పొత్తు ఖాయమైందనేలా పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుండటం వల్ల తాను సీట్లను తగ్గించుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందంటూ పవన్ చెప్పేశారు. దీంతో మూడు పార్టీల పొత్తు లాంఛనమేనని తెలుస్తోంది.

టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఏపీలో బీజేపీతో పొత్తుపై సంప్రదింపులు జరిపారు. బీజేపీ కూడా పొత్తులో కలిసేందుకు రెడీగా ఉంది. చంద్రబాబుతో భేటీ తర్వాతి రోజు ఓ జాతీయ మీడియా ఛానెల నిర్వహించిన సదస్సులో ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, ఎన్డీయేలోకి కొత్త పార్టీలు వస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ, జనసేనతో పొత్తు గురించే అమిత్ ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌ను ఎన్నికల్లో ఎదుర్కొవాలంటే బీజేపీ అండ కూడా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో బీజేపీతో కలుపుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

అయితే పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కీలకంగా మారింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ సీట్లను ఎక్కువగా బీజేపీ ఆశిస్తోంది. బీజేపీకి 9 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. జనసేన, బీజేపీకి కలిసి మొత్తంగా 33 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేలా ఒప్పదం కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. పొత్తులపై అధికారిక ప్రకటన తర్వాత రెండు, మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో 99 సీట్లను అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 సీట్లల్లో పోటీ చేయనుండగా.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget