అన్వేషించండి

Srikakulam Politics : శ్రీకాకుళం జిల్లాలో ఐదు సీట్లకు అభ్యర్థులు పెండింగ్ - ఆందోళనలో టీడీపీ నేతలు!

Srikakulam TDP : శ్రీకాకుళం జిల్లాలో ఐదు స్థానాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

Srikakulam Politics  :   తెలుగుదేశం పార్టీ   అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితా గురువారం విడుదల చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలలో మొదటి విడతలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాలవలస, రాజాం నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.  రెండవ జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కేవలం నరసన్నపేట అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు.  నియోజకవర్గ ఇన్చార్జ్ బగ్గు రమణమూర్తి వైపే పార్టీ అధినేత మొగ్గుచూపుతూ అతనికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖరారు చేశారు.  

మరో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు ? 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మరో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెరుగుతోంది. రెండో జాబితాలో కూడా తమ పేర్లు ప్రకటించకపోవడంపై సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పలాస నియోజకవర్గ ఇన్చార్జ్ గౌతు శిరీష, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కలమట వెంకటరమణ తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. 

అచ్చెన్నాయుడు కసరత్తు చేస్తున్నారా ? 

టిక్కెట్లు ఖరారు చేయకపోవడంతో  నియోజకవర్గాల ఇన్చార్జిల అనుచరులు, అభిమానులు పార్టీ పెద్దల తీరుపై కొంత ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. టికెట్ల ఖరారు విషయంలో జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చం నాయుడు రెండు మూడు నియోజకవర్గాల విషయంలో ప్రస్తుతం ఉన్న ఇన్చార్జిలను కాకుండా కొత్త వారి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నందునే ఈ నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించలేదని కొందరు మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం లో 2009 నుంచి టీడీపీ రెండు వర్గాల విభేదాల వల్ల పార్టీ ఓడిపోతూవస్తుండటం, ఈసారికి కూడా విబేధాలు అలానే ఉండటం తో అభ్యర్థిని నిర్ణయించడంలో పార్టీ అధినేత వెనుకాడ వలసి వస్తోందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

జనసేన, బీజేపీకి కేటాయించే సీట్లేమిటి ?                             

పెండింగ్ ఉన్న ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు కేటాయించే సీట్లు అంశంపై స్పష్టత రాలేదు.  శ్రీకాకుళం బీజేపీకి కేటాఇస్తారని అంటున్నారు. జనసేనకు కూడా ఓ సీటు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఐదు సీట్లలో రెండు మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉండటంతో  నేతలు ఆందోళన చెందుతున్నారు.  మొత్తానికి రెండో జాబితాలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులు ప్రకటించకపోవడంతో పార్టీలో విభేదాలకు తావిస్తున్నట్లుగా ఆయా నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                                                             

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget