అన్వేషించండి

Andhra News : ఓటర్ల జాబితాపై టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు - ఈసీకి పోటాపోటీ ఫిర్యాదులు !

Andhra EC Meet : ఓటర్ల జాబితాలో అవకతవకలపై టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఏపీలో పర్యటిస్తున్న ఈసీ బృందానికి తమ వాదనలు వినిపించాయి.

YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అంశం మరోసారి సంచలనంగా మారింది. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఓటర్ల జాబితాలోని అవకతవకలతో ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సన్నాహాలపై ఏపీలో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం అధికారులకు తమ ప్రజెంటేషన్  ఇచ్చాయి. 

దొంగ ఓట్లపై పరస్పర ఫిర్యాదులు చేస్తున్న టీడీపీ, వైసీపీ                               

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.. దీంతో.. విజయవాడ వేదికగా ఎన్నికల కమిషన్‌ ముందు వైసీపీ-టీడీపీ పంచాయితీగా మారింది పరిస్థితి.. ఓట్ల తొలగింపు మీద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు .

ఈసీ ప్రతినిధఉల్ని ఆధారాలతో కలిసిన ఇరు పార్టీల నేతలు                           

విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ, జనసేన నేతలు కలిశారు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, బోండా ఉమా.. జనసేన నేతలు గాదె వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు నేతలు సీఈసీ ప్రతినిధులను కలిశారు.. రాష్టంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు. మరోవైపు.. వైసీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు.. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, అబ్బయ్య చౌదరి తదితరులు ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఉన్నారు.. వారు కూడా ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.

గతంలో ఢిల్లీలోనూ ఫిర్యాదులు                                      

 గతంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో 40.76 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు రాష్ట్రంలో కూడా నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, కక్ష పూరితంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.. వైసీపీ నేతలే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ టీడీపీ కూడా పలు సందర్భాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.

టాప్ హెడ్ లైన్స్

ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
ధనస్సు రాశి వారఫలాలు ఆగస్టు 9-15: రెట్టింపు ప్రయోజనాలు, వ్యాపారంలో లాభాలు, కుటుంబ మద్దతు!
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget