TDP News: టీడీఎల్పీ మీటింగ్‌కు డేట్ ఫిక్స్, ఆ మర్నాడే సీఎంగా చంద్రబాబు ప్రమాణం
AP Latest News: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీ సహా కూటమి పార్టీల అధినేతల్ని ఆహ్వానిస్తున్నట్లు బుచ్చయ్య చౌదరి చెప్పారు. 11న టీడీఎల్పీ సమావేశం కాగానే మర్నాడు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు.
TDLP Meeting on June 6th: తెలుగు దేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబుని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని చెప్పారు. ఆ నివేదికను గవర్నర్ కు పంపుతామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మర్నాడు జూన్ 12న ఉంటుందని అన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల అధినేతల్ని ఆహ్వానిస్తున్నట్లు బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇటు చంద్రబాబు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని చెప్పారు. ఇంకా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు వెళ్తారని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఓడిపోయాననే అక్కసుతో జగన్ మోహన్ రెడ్డి ఇంకా టీడీపీపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారని అన్నారు. అసహనంతోనే పదే పదే టీడీపీ శ్రేణులపై దాడులకు ప్రేరేపిస్తున్నారని.. తాము దాడులు చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.