IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Minister Perni Nani : చంద్రబాబును సీఎం చేయాలనే పవన్ తాపత్రయం - 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా జనసేనకు లేదా? : మంత్రి పేర్ని నాని

Minister Perni Nani : చంద్రబాబు 40 ఏళ్ల అనుభవంతో చేయలేని పనిని సీఎం జగన్ మూడేళ్లలో చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. జనసైనికులు పవన్ సీఎం కావాలని కోరుకుంటుంటే.. పవన్ చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నాడన్నారు.

FOLLOW US: 

Minister Perni Nani : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి సీఎం జగన్(CM Jagan) నాంది పలికారని మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పరిపాలనా సౌలభ్యం, ప్రజా సౌకర్యార్థం కోసం   సీఎం జగన్ పాదయాత్ర(Padayatra)లో ఇచ్చిన మాట ప్రకారం 26  జిల్లాలు  ఏర్పాటుచేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 13 జిల్లా కేంద్రాలు వచ్చాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చే సరికి కేవలం 6 జిల్లాలు మాత్రమే ఉన్నాయన్నారు. 1979 తర్వాత అంటే 42 ఏళ్ల నుంచి కొత్త జిల్లాల(New Districts) ఏర్పాటు లేదన్నారు. జనాభా పెరిగిందని జిల్లాలు పెంచాలని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదని మంత్రి పేర్ని నాని(Minister Perni Nani) ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమస్యల పట్ల అవగాహన లేకుండా పవన్  మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై స్వామిభక్తి  ఎక్కువై పవన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్  ఎక్కడున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ ను నమ్మి ఆయన జెండా మోస్తున్నవారు పవన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నారని, కానీ చంద్రబాబును(Chandrababu) సీఎం చెయ్యాలనే పవన్ ఆలోచిస్తున్నారన్నారు. 

40 ఏళ్ల అనుభవం ఏమైంది?

రాష్ట్ర చరిత్రలో నూతన ఆధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని మంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చి మాట ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని గుర్తుచేశారు. కేవలం మూడేళ్ల అనుభవంలోనే ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. వైఎస్‌ జగన్ ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పాఠశాలలు మూడపడే స్థాయి నుంచి ఇవాళ సీట్లు ఖాళీ లేవు అనే స్థాయికి చేరుకున్నాయన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ(Forty Years Industri అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. చివరికి ఓ యువకుడి వద్ద కుప్పం రెవిన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారన్నారని ఎద్దేవా చేశారు.  

 జనసేన 175 స్థానాల్లో పోటీ చేయాలి 

పవన్ కు ఏటపాక, కుకునూరు ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా తెలీదా అని మంత్రి ప్రశ్నించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని విమర్శించారు. తన అభిప్రాయం ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. షూటింగ్ లో ఉండి పట్టించుకునే సమయం లేదేమో అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో(175 Constituencies) జనసేన పోటీ చెయ్యాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుకుంటుంటే టీడీపీ(TDP)తో పొత్తుపెట్టుకోడానికి పవన్ తాపత్రయపడుతున్నారని మంత్రి విమర్శించారు.  సొంత పార్టీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చాలని పవన్ కు హితవు పలికారు. కార్యకర్తల కోరిక మేరకు 175 సీట్లలో పోటీ చేయాలని పవన్ కు సూచించారు. 

Published at : 04 Apr 2022 05:51 PM (IST) Tags: pawan kalyan minister perni nani AP new districts

సంబంధిత కథనాలు

MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!

MP Raghurama Krishn Raju : ఎంపీ రఘురామ అనర్హత పిటిషన్ పై విచారణ, ప్రివిలేజ్ కమిటీ ఎదుట మార్గాని భరత్ హాజరు!

Revanth Reddy: ఇక్కడ ఫాంహౌస్ దాటరు! అటు వెళ్లి నష్ట పరిహారమా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

Revanth Reddy: ఇక్కడ ఫాంహౌస్ దాటరు! అటు వెళ్లి నష్ట పరిహారమా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

Lokesh On Ysrcp Govt : తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!

Lokesh On Ysrcp Govt :  తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు, సజ్జలతో భేటీ - నారా లోకేశ్ సంచలన కామెంట్స్!

Breaking News Live Updates జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు

Breaking News Live Updates జ్ఞానవాపి మసీదు కేసులో సివిల్ దావా విచారణ ప్రారంభించిన వారణాసి జిల్లా కోర్టు

MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్

MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్‌మీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Gyanvapi Mosque Case: జ్ఞాన్‌ వాపి మసీదు కేసులో వాదనలు పూర్తి- తీర్పు రేపటికి రిజర్వ్‌ చేసిన వారణాసి కోర్టు

Gyanvapi Mosque Case: జ్ఞాన్‌ వాపి మసీదు కేసులో వాదనలు పూర్తి- తీర్పు రేపటికి రిజర్వ్‌ చేసిన వారణాసి కోర్టు

CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్‌ సదస్సులో సీఎం జగన్

CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్‌ సదస్సులో సీఎం జగన్