CM Jagan : డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల ఇళ్లు, సీఎం జగన్ కీలక ఆదేశాలు
CM Jagan : డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
CM Jagan : ఎస్డీజీ లక్ష్యాల ఆధారంగా కలెక్టర్ల పనితీరుకు మార్కులు ఉంటాయని సీఎం జగన్ అన్నారు. గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిధులపై కూడా సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడప గడపకు కార్కక్రమం పూర్తైన తర్వాత నెల రోజుల్లో ప్రాధాన్యత ప్రకారం పనులు మొదలుపెట్టాలని కావాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ఉండాలన్నారు. సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై కూడా గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి అధికారి స్పందన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అప్పుడే 50 శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలలోపు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం జరగాలని ఆదేశించారు. స్పందనలో సమస్యలు పరిష్కారం అయితే పిటిషనర్ తో అధికారి సెల్ఫీ దిగి ఫొటో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి కార్యాలయంలో ఏసీబీ నెంబర్ కచ్చితంగా ఉంచాలన్నారు.
డిసెంబర్ 21 నాటికి ఇళ్లు
ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలన్నారు. ఇళ్లు పూర్తయ్యే నాటికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు సమకూర్చాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్-3 కింద డిసెంబర్‌లో కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయన్నారు. జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్, విలేజ్ క్లినిక్స్ పై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఆరు సచివాలయాలకు వెళ్లాలి
ప్రతి ఎమ్మెల్యే నెలలో ఆరు సచివాలయాలకు వెళ్లాలని సీఎం జగన్ అధికారులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. తర్వాత మరో ఆరు సచివాలయాలకు వెళ్లేటప్పటికి ముందు వెళ్లిన సచివాలయాలలో పనులు స్టార్ట్ అవ్వాలన్నారు. ఈ-క్రాప్‌పై ప్రతి కలెక్టర్ బాధ్యత తీసుకోవాలన్నారు. డిజిటల్ లైబ్రరీ బిల్టింగ్‌లకు అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఉపాధిహామీ కూలీలకు రూ.240
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి, ఆ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25వ తేదీన ఈ-క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలును అధికారులకు సీఎం వివరించారు. మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనాలపై కూడా సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ. 240 అందేలా చూడాలన్నారు. ఏ ఒక్క కూలీ నష్టపోకుండా అందరికీ సక్రమంగా వేతనం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read : Harish Rao : ఏపీ సర్కార్‌పై సెటైర్లు ఆపని హరీష్ రావు - ఈ సారి అన్నీ కలిపి ..