News
News
X

Harish Rao : ఏపీ సర్కార్‌పై సెటైర్లు ఆపని హరీష్ రావు - ఈ సారి అన్నీ కలిపి ..

ఏపీ సర్కార్‌పై మరోసారి సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అక్కడి పాలనను.. తెలంగాణతో పోల్చి ఎంత మంచి చేస్తున్నామో వివరించారు.

FOLLOW US: 
 
Harish Rao :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోల్చుకుని తమ ప్రభుత్వం ఎంతో బాగా పని చేస్తుందని చెప్పడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ మొహమాటపడరు. తమ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎప్పుడూ విమర్శించకపోయినా సరే హరీష్ రావు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ఏపీతో పోలికలు తెచ్చారు. ఈ సారి ఉద్యోగుల సంక్షేమం.. ఫిట్మెంట్.. టీచర్ల సమస్యల గురించి కూడా మాట్లాడారు. 

ఏపీలో ఉద్యోగులు, టీచర్లు సమస్యలపై పోరాటం చేస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారని .. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మంచి ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవంగా చూస్తోందన్నారు. ముఖ్యంగా టీచర్ల విషయాన్ని హరీష్ రావు నొక్కి చెప్పారు. టీచర్లను ఏపీ ప్రభుత్వం ఎలా చూస్తుందో కనిపిస్తోందని.. కానీ తెలంగాణ ప్రభుత్వం గురువులకు తగ్గ గౌరవం ఇస్తోందన్నారు. ఇటీవలి కాలంలో ఏపీలో టీచర్లు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో పలు రకాల యాప్‌లను ప్రవేశపెట్టి .. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ అంశాలనే హరీష్ ప్రస్తావించి.. తెలంగాణ టీచర్లకు తాము ఎంత మంచి చేస్తున్నామో వివరించే ప్రయత్నం చేశారు. 

ఇక హరీష్ రావు ఎప్పుడు ఏపీ సర్కార్‌పై సెటైర్లు వేయాలన్నా ముందుగా కరెంట్ మీటర్ల అంశాన్ని తెరపైకి తెస్తారు. ఈ సారి కూడా అదే అంశాన్ని హైలెట్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు తగిలించడమేనని .. అలా మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఏపీ సర్కార్ అప్పు తెచ్చుకుందన్నారు. తామూ ఒప్పుకుంటే ఏటా రూ. ఆరు వేల కోట్లు వస్తాయని కానీ రైతుల గురించి ఆలోచించే.. తాము ఆ సొమ్మును వదులుకున్నామన్నామన్నారు. ఓ వైపు మోటార్లకు మీటర్లు పెట్టడం ద్వారా నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. దానికి భిన్నంగా హరీష్ రావు చెబుతున్నారు. చాలా కాలంగా ఆయన ఇదే వాదన వినిపిస్తున్నారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు.. తాడిపత్రికి చెందిన ఓ రైతును కరెంట్ పరిస్థితి గురించి వాకబు చేశానని కానీ  మూడు గంటలు.. అదీ కూడా వచ్చీ పోతూంటుందని రైతు చెప్పారని హరీష్ రావు తెలిపారు. ఏపీలో కరెంట్ సమస్యలు ఎక్కువని.., ఇక రోడ్ల గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. 

ఏపీ సర్కార్‌ను ఆలా టార్గెట్ చేస్తోంది హరీష్ రావు ఒక్కరే కాదు.  ప్రశాంత్ రెడ్డి,  పువ్వాడ అజయ్, చివరికి కేటీఆర్ కూడా ఏపీ సర్కార్ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఓ సందర్భంలో కేటీఆర్ అయితే.. ఏపీలో నివసించడం నరకం అని తన స్నేహితులు చెప్పారని ప్రకటించారు. ఈ అంశం దుమారం రేగింది. తర్వాత సద్దుమణిగిపోయింది. సీఎం జగన్ తనకు సోదరుడులాంటి  వ్యక్తి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వాన్ని  ఉద్దేశపూర్వకంగా తెలంగాణ మంత్రులు ఉదాహరణగా చూపించి సెటైర్లు వేస్తూంటారు కానీ..  వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. 

News Reels

Published at : 29 Sep 2022 05:20 PM (IST) Tags: Harish satires on Harish Rao Telangana Government and AP Sarkar

సంబంధిత కథనాలు

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Andhra Pradesh development projects In 2022 : కొత్త జిల్లాలు ఏర్పాటు - కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన ! ఏపీలో 2022 అభివృద్ది మైలు రాళ్లు ఇవిగో

Andhra Pradesh development projects In 2022 :  కొత్త జిల్లాలు ఏర్పాటు - కీలక  ప్రాజెక్టులకు శంకుస్థాపన ! ఏపీలో 2022 అభివృద్ది మైలు రాళ్లు ఇవిగో

టాప్ స్టోరీస్

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !