అన్వేషించండి

Supreme Court: అమరావతి ఆర్ 5 జోన్‌ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు - ఏపీ సర్కార్‌కు ఇబ్బందే

అమరావతి ఆర్ 5 జోన్ ఇళ్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారి చేసింది.


Supreme Court:   అమరావతి ఆర్ 5 జోన్ విషయంలో ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో స్టే వస్తే.. ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం అనుకుంది. కేసు నవంబర్ కు వాయిదా పడటంతో అప్పటి వరకూ ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించే అవకాశం లేదు. 

ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందంటే ?           

హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కీలక అంశాలు ఉన్నాయి.  అమరావతి ఆర్‌5 జోన్‌లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను  వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.  స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ కట్టడానికి కాదనిస్ష్టం చేసింది.  అదే సమయంలో  ప్రభుత్వం తామే నిర్ణయించిన భూమి విలువ రూ.   345 కోట్లు  CRDA కు చెల్లించలేదని హైకోర్టు ధర్మాసనం మరో కారణంగా తెలిపింది. మూడో కారణంగా మొత్తం ఖర్చు 1500 - 2000 కోట్లు ...స్థలాలు/ ఇల్లు...తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు దీనికి భాధ్యత ? వహిస్తారని  ప్రశ్నించింది.  ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది.  

సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజా ధనం వృధా                                        

అమరావతి తీర్పు లో కూడా ఆప్పటి వరకు  చేసిన ఖర్చు వృధా అవుతుందని కోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది.  CRDA నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన వారికి హౌసింగ్ కోసం 5 శాతం భూమి కేటాయించారని... కానీ బయట వారికి స్థలాలు ఇస్తామని తెచ్చిన సవరణలు చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు.  ఈ పరిస్థితులలో ఇళ్ళ నిర్మాణం అనుమతించ లేమని ధర్మానసం స్పష్టం చేసింది.  సుప్రీం లో కేసులు తేలిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని  తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో  అక్కడ వచ్చే తీర్పును బట్టి అమరావతిలో ఇళ్ల స్థలాల నిర్ణయం ఆధారపడి ఉంటుంది.  

ఉద్దేశపూర్వకంగానే  ఆర్ 5 జోన్ ఏర్పాటు చేశారనే విమర్శలు

 అమరావతిని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే  కోర్ క్యాపిటల్ ఎరియాలో రైతులు ఇచ్చిన  పొలాలను.. ఆర్ 5 జోన్  గా మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇతర చోట్ల స్థలాలు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు కట్టించకుండా.. కేవలం రాజధానిలో ఆర్ 5 జోన్ లోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని అంటున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం అవకాశం లేనప్పటికీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాలపై .. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఇప్పటికే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించడంతో రైతులు మరోసారి కోర్టుకు వెళ్లారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget