అన్వేషించండి

YS Sunitha : అలా అయితే మమ్మల్ని అరెస్టు చేయాలి కదా - వైఎస్ జగన్ కు సునీత సూటి ప్రశ్న

Andhra News : వైఎస్ వివేకా హత్యపై మరోసారి సునీత సంచలన ఆరోపణలు చేశారు. అయితే తమను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నంచారు.

YS Sunitha Press Meet :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఘటన తర్వాత మా వారిని  కానీ..మమల్నికానీ ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం జగన్ ను వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో.. అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో వివరించారు. కొన్ని ఫోన్ కాల్స్ వివరాలను వెల్లడించారు.              

వివేకా హత్య జరిగిన రోజున ఉదయం ఐదున్నర గంటలకు లోటస్ పాండ్‌లో జగన్ సమావేశం పెట్టారని.. ఆ సమావేశంలో మాజీ సీఎస్ అజేయకల్లం ఉన్నారన్నారు. ఐదున్నర సమయంలో ఫోన్ మాట్లాడి వచ్చిన తర్వాత అజేయకల్లంకు వివేకా చనిపోయారని చెప్పారని సీబీఐకి.. ఆయన వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. తర్వాత ఆయన మాట మార్చితే.. వాంగ్మూలం రికార్డింగ్ ను సీబీఐ కోర్టుకు కూడా సమర్పించిందని గుర్తు చేశారు. అవినాష్ రెడ్డి అదే రోజు 6.26 నిమిషాలకు ఫోన్ కాల్ వస్తే ఒక్క నిమిషాంలో వివేకా ఇంటి వద్ద ఉన్నారన్నారు. ఆ తర్వాత ఆయన భారతి పీఏ నవీన్ కు ఫోన్ చేసి ఆరు నిమిషాలు మాట్లాడారన్నారు. ఓఎస్డీ కృష్ణమోహన్, శివప్రకాష్ రెడ్డితోనూ మాట్లాడారని ఇన్ని ఫోన్ కాల్స్ మాట్లాడిన తర్వాత కూడా గుండెపోటు అని సాక్షిలో ఎందుకు వేశారని సునీత ప్రశ్నించారు.                     
 
 వివేకానంద హత్య అనంతరం కడప, పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ కరువు అయ్యిందని  ఆవేదన వ్యక్తం చేశారు.  కేసు గురించి మాట్లాడడానికి నిందితులను చూసి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  నిజమైన దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ..  వైఎస్‌ జగన్‌  అధికారంలో ఉండికూడా బాబాయి వివేకా హత్యపై ఎందుకు నోరు మెదపడం లేదని, నిందితులను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పులివెందుల , కడప   ప్రజలు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిందితులు మళ్లీ గెలుస్తే మరెంతో మంది బలి అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వైఎస్‌ రాజారెడ్డి  నుంచి వైఎస్సార్‌, వైఎస్‌ వివేకా వరకు ప్రజలకు నమ్మకం ఉండేదని, ప్రజలు ధైర్యంగా వెళ్లి సమస్యలు విన్నవించుకుని  పరిష్కరించుకునేవారని  సునీత గుర్తు చేసుకున్నారు.  వారి లక్షణాలు జగన్‌లో ఏ ఒక్కటి కనిపించవన్నారు.  ఇలాంటి స్థితిలో మీరెలా వారసులు అవుతారని సునీత ప్రశ్నించారు. ఎదైనా సమస్యలు చెప్పుకుంటే కేసులు పెట్టేస్తున్నారని సీఐడీని పంపుతున్నారని విమర్శిస్తున్నారు.   ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కుకూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని పార్టీలకు అంటగట్టడం న్యాయమా అని ప్రశ్నించారు.  టీడీపీ గాని, ఇతర ఏ పార్టీలకు మద్దతుగా  తాను మాట్లాడటం లేదని.. న్యాయం కోసమే తన పోరాటం సాగుతోందన్నారు.                                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SpaceX Crew 10 Mission Success: స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP DesamDavid Warner Poster From Robin Hood Movie | వార్నర్ పోస్టర్ రిలీజ్ చేసిన రాబిన్ హుడ్ టీం | ABP DesamPawan Kalyan on Tamilnadu Hindi Protest | తమిళనాడు హిందీ ఉద్యమాన్నే టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SpaceX Crew 10 Mission Success: స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు
Dhoni Viral Video: సిక్స‌ర్లు ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ధోనీ బ్యాటింగ్ వీడియో.. ఈనెల 23న చెన్నై తొలి మ్యాచ్
సిక్స‌ర్లు ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ధోనీ బ్యాటింగ్ వీడియో.. ఈనెల 23న చెన్నై తొలి మ్యాచ్
Viral Video: ఫుల్లుగా తాగి బస్సులోకి ఎక్కలేదు, కానీ 20 కిలోమీటర్లు జర్నీ చేశాడు - ఎక్కడో కాదు ఏపీలోనే
ఫుల్లుగా తాగి బస్సులోకి ఎక్కలేదు, కానీ 20 కిలోమీటర్లు జర్నీ చేశాడు - ఎక్కడో కాదు ఏపీలోనే
Revanth Reddy: రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
రెండో సారీ నేనే ముఖ్యమంత్రి - పథకాల లబ్దిదారులే మా ఓటర్లు - రేవంత్ చిట్‌చాట్
South Actress: యాభై సెకన్లకు 5 కోట్ల రెమ్యూనరేషన్, 200 కోట్ల ఆస్తులు... ఎఫైర్లు, గొడవలు తక్కువేమీ కాదు... ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో తెల్సా?
యాభై సెకన్లకు 5 కోట్ల రెమ్యూనరేషన్, 200 కోట్ల ఆస్తులు... ఎఫైర్లు, గొడవలు తక్కువేమీ కాదు... ఈ సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరో తెల్సా?
Embed widget