Sugali Preethi case controversy: పవన్ కల్యాణ్‌ది మోసం - జనసేన ఆఫీస్ ఎదుట ఆమరణ దీక్ష - సుగాలి ప్రీతి తల్లి సంచలన ప్రకటన
Sugali Preethi : జనసేన పార్టీ ఆఫీసు ముందు ఆమరణ దీక్ష చేస్తానని సుగాలి ప్రీతి తల్లి ప్రకటించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ గాలికొదిలేశారన్నారు.

Sugali Preethi Allegations against Pawan Kalyan: జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేస్తానని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రకటించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ గాలికొదిలేశారని.. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‍పై చేస్తామని పవన్ చెప్పారన్నారు. 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. నా కూతురికి న్యాయం చేయలేకపోతున్నారని విమర్శించారు. - జనసేన కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఏపీ హోంమంత్రికి శ్రీకాంత్ పెరోల్‍పై ఉన్న శ్రద్ధ మా విషయంలో లేదని.. - గిరిజనులు ఓట్ల కోసమే పనికొస్తారా అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ చేస్తానన్నారు. ఇప్పటికైనా సుగాలి ప్రీతి మృతిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో 2017లో సుగాలి ప్రీతి అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమె కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. 2017 ఆగస్టు 18న రాత్రి ఆమె ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. విచారణను పోలీసులు, స్కూల్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి చేసి కేసు దాచిపెట్టారని సుగాలి ప్రీతి ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కేసును ప్రధానంగా చేసుకుని 2020లో కర్నూలులో ర్యాలీ చేశారు. "మా ప్రభుత్వం వస్తే మొదటి కేసు ఇదే" అని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో కూడా గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరిలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రీతి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. సీబీఐకి అప్పగించేందుకు GO 37 జారీ చేశారు. కానీ సీబీఐ "GO చెల్లదు, లెటర్ రాలేదు" అని చెప్పింది. 2020 డిసెంబర్‌లో కుటుంబం ఢిల్లీ వెళ్లి తిరిగి వచ్చింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 ఫిబ్రవరిలో సీబీఐ హైకోర్టుకు "వనరులు లేవు, కేసు తీసుకోలేకపోతున్నాము" అని తెలిపింది.
తొలి సంతకం తన కుమార్తె కేసే అని చెప్పి.. 14 నెలలు అవుతున్నా @PawanKalyan స్పందించడం లేదు
— Telugu Feed (@Telugufeedsite) August 28, 2025
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కుమార్తెకు న్యాయం చేస్తానని మాటిచ్చి, డిప్యూటీ సీఎం అయ్యాక పట్టించుకోవడం లేదు
– సుగాలి ప్రీతి తల్లి pic.twitter.com/3oog9XJHYx
2024 ఆగస్టు 27న హోంమంత్రి అనిత కలిసిన పార్వతి, "కేసును సీఐడీకి అప్పగిస్తాము, రీ-ఓపెన్ చేస్తాము" అని చెప్పారు. కానీ ఇంకా జీవో రాలేదు. కేసు ఇప్పుడు స్థానిక పోలీసుల వద్దే ఉంది. నిందితులు బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రీతి కుటుంబం సీబీఐ విచారణ, నిందితులకు కఠిన శిక్ష కోరుతోంది.





















