అన్వేషించండి

Nuzuvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెరుగుపడని పరిస్థితులు - ఇప్పటివరకూ 1300 మందికి అస్వస్థత!

Andhra News: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో తాజాగా 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకూ దాదాపు 1300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Students Illness In Nuzivid IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో (Nuzivid IIIT) విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. తాజాగా, 113 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్ర వాతావరణంతో గతం వారం రోజులుగా వందల మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది. ప్రధానంగా 3 మెస్‌ల్లో ఆహారం తిన్న విద్యార్థులు చాలా మంది అనారోగ్యం పాలు కాగా.. గత 4 రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఆదివారం 165, సోమవారం 229, మంగళవారం 345, బుధవారం 131, తాజాగా 113 మంది ఆస్పత్రుల్లో చేరారు. 

అయితే, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, ట్రిపుల్ ఐటీని తనిఖీ చేసేందుకు వెళ్లిన గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథికి విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మంత్రి కాలేజీ పరిసరాలు, మెస్‌లను పరిశీలించగా.. అక్కడి దారుణాలను ఆయనకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దుర్వాసన వస్తోన్న కూరలు, అపరిశుభ్రంగా ఉన్న వంటగది, నాణ్యత లేని భోజనం వంటి వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి ట్రిపుల్ ఐటీపై దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లా వైద్యాధికారి కాలేజీని పరిశీలించారని.. ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని అన్నారు. అనంతరం మంత్రి అధికారులు, మెస్ నిర్వాహకులతో సమావేశమై.. కాలేజీ, మెస్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మారని తీరు

ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్థసారథి పర్యటించినా.. నారా లోకేశ్ (Nara Lokesh) ట్వీట్ చేసినా పరిస్థితి ఏమాత్రం మారలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మంత్రి పరిశీలించిన అనంతరం కూడా అల్పాహారంలో పాడైన గుడ్లు, రుచీ పచీ లేని ఉప్మా పెట్టారని వాపోయారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ ఆస్పత్రుల్లోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని అన్నారు. రోగుల సంఖ్య తక్కువగా చూపించేందుకు ఓపీలు కూడా రాయడం లేదని.. ఆరోగ్య పరిస్థితి విషమించినా మందులిచ్చి పంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ పేషెంట్లుగా జాయిన్ చేసుకోవడం లేదని పేర్కొంటున్నారు.

అటు, అల్లూరి జిల్లాలోని (Alluri District) అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడ (Dumbriguda) మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి 50 మంది విద్యార్థులు రాత్రి ఆహారం తిని వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే వారిని అరకులోయలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. 

భోజనం బాగోలేదని..

మరోవైపు, అంబేడ్కర్ జిల్లా కె.గంగవరం మండలంలోని బట్లపలిక స్కూల్‌లో భోజనం బాగోలేదని విద్యార్థులు నిరసన తెలిపారు. భోజనం నాణ్యత లేదని పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ విమర్శలు చేసింది. విద్యార్థులు ఆకలితో ఇంటికి వెళ్లిపోతున్నారంటూ.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read: Pencsions: భారీ వర్షంలో పెన్షన్ల పంపిణీకి ఇబ్బందులు - సచివాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు వెసులుబాటు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget