Srisailam Dam: శ్రీశైలం డ్యాం 7 గేట్లు ఎత్తివేత, నాలుగో గేట్ ఎత్తగానే దిగువన చిక్కుకున్న కారు
Srisailam Dam Reservoir: శ్రీశైలంలో గేట్లు తెరవడంతో దిగువన నదిలో నీటి మట్టం పెరిగింది. అప్పటికే నీరు లేకుండా ఉన్న నదిలోకి కారుతో వెళ్లగా యువకులు చిక్కుకుపోయారు.
Srisailam News: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్ 7 గేట్లను దాదాపు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 4,02,960 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,50,934 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 883.50 అడుగులుగా రిజర్వాయర్ నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు.
దిగువన చిక్కుకున్న కారు
శ్రీశైలం జలాశయ మూడు గేట్లను సోమవారమే ఎత్తారు. మిగతా గేట్లను నేడు ఎత్తారు. అలా ఉన్నట్టుండి 4వ గేట్ ఎత్తివేయ్యడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో దిగువన నది స్నానం చేస్తున్న భక్తులు వెంటనే బయటకు వచ్చారు. ఈ తరుణంలో నదిలోనే ఉండి స్నానం చేస్తున్న దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన యువకులు అయిన మాజీ సర్పంచ్ యూ. కృష్ణ, ఈ. గురుచర్ గౌడ్, ఈశ్వర్ సిద్ధి (DBF VKB ప్రెసిడెంట్) B రమేష్ (ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు) నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయిన కారును బయటకు తియ్యడానికి నానా విధాలా ప్రయత్నం చేశారు. చివరకు కారును బయటకు తీశారు.