News
News
X

Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్

Dharmana Prasada Rao : సీఎం జగన్ దూరదృష్టితో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారు.

FOLLOW US: 

Dharmana Prasada Rao : అమ్మఒడి పథకం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విద్యకు సీఎం జగన్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పేద పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించాలన్నదే సీఎం ఆశయమన్నారు. శ్రీకాకుళంలో అమ్మఒడి కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. 

ఇంకా ధర్మాన ఏమన్నారంటే...

" " అమ్మ ఒడి పథకం అషామాషీగా వచ్చింది కాదు. దూరదృష్టితో సీఎం జగన్‌ చేసిన ఆలోచన ఇది. ఓ సాధారణ కుటుంబంలోని పిల్లాడు కూడా అందరిలా చదువుకోవాలి అని కలలు కన్న అనేక కుటుంబాలు ఇలాంటి సదుపాయాల కోసం ఎదురు చూశారు. కానీ నెరవేరలేదు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో ఇది ఉంది. గడిచిన కాలంలోని పాలకులు, ప్రభుత్వాలు మన రాష్ట్రంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఇంత సంపన్నమైన రాష్ట్రం దేశంలో 22వ స్థానంలో అక్షరాసత్య ఉంది. కేరళ మొదటిస్థానంలో ఉంది. ఏపీ 22వ స్థానంలో ఎందుకు ఉంది. ఇది ఆలోచన చేయాలి. గడిచిన 70 ఏళ్ల క్రితమే జగన్‌ లాంటి వ్యక్తి ఏపీకి వచ్చి ఉంటే తల్లిదండ్రుల స్థితి, పిల్లల పరిస్థితి జీవన ప్రమాణాలు ఇలా ఉండేవా? ఇవాళ ఇచ్చిన ప్రాధాన్యత 50 ఏళ్ల క్రితం ఇచ్చి ఉంటే ప్రతి కుటుంబంలోని జీవన ప్రమాణాలు అత్యున్నత స్థానంలో ఉండేవి. ప్రతిపక్షాలు, అవగాహన లేని వ్యక్తులు ఇదేదో డబ్బులు పంచే కార్యక్రమం అనుకుంటున్నారు. సంపన్న వర్గాలు కూడా సరిగా ఆలోచన చేయాలి. సమాజంలోని అట్టడుగు వర్గాల కుటుంబాలకు 75 సంవత్సరాల తరువాత కూడా రాజ్యాంగంలోని హక్కులు పొందలేకపోతే ఈ సమాజం ప్రశాంతంగా ఉంటుందా? అది ఆలోచన చేసి జగన్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే అమ్మఒడి గురించి ఆలోచన చేసి అమలు చేస్తున్నారు. "
-ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి

గత ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే

" ధనవంతుల పిల్లలు చదువుకునే విధంగా పేద పిల్లలు కూడా చదువుకోవాలని సీఎం జగన్‌ ఆలోచన చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది సాధారణ విషయం కాదు. ఎన్నికలు అయిన వెంటనే ప్రారంభించిన కార్యక్రమం అమ్మ ఒడి పథకం. ఇవాళ మూడో విడత అమ్మ ఒడి కింద పేద కుటుంబాలకు సాయం అందజేశారు. ఇదే లేకపోతే తమ పిల్లాడి కడుపు పోషించుకునేందుకు, ఆకలి తీర్చుకునేందుకు కూలి పనికి పంపించేవారు. అందుకే సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం ఒకప్పుడు ఉన్న ప్రభుత్వాలు తీసుకుని ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి భిన్నంగా ఉండేదన్నదే నా అభిప్రాయం. సంపన్నులు, ప్రతిపక్షాలు ఈ పథకాలను విమర్శించడం భావ్యం కాదు. ఇంతవరకు చేసిందే తప్పిదాలు. ఒక నాయకుడు సరిగా ఆలోచన చేసి అమలు చేస్తున్న పథకాలపై విమర్శలు సరికాదు. పత్రికల్లో, ఇతర వేదికల్లో విమర్శలు చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు. సమసమాజం ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను సంపన్నవర్గాలు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. "
-ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ మంత్రి

ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం

రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడిన జిల్లా. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాను అభివృద్ధి చేశారు. మాకు వనరులు ఉన్నాయి.  దురదృష్టవశాత్తు గత పాలకులు సరిగ్గా దృష్టిపెట్టలేదు. రాజశేఖరరెడ్డి హాయంలో తప్ప మిగిలిన వారు సరిగా పట్టించుకోలేదు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్దానం ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కోసం నీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది నిజం కాదా? కిడ్నీ వ్యాధులపై అనేక మంది స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఐదేళ్లు పాలన చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.250 కోట్లతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. రోగులకు డబ్బులు ఇచ్చి శాశ్వత పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రిగా జగన్‌ను ఎంతో ఆరాధిస్తున్నారు.  - మంత్రి ధర్మాన ప్రసాదరావు 

 

Published at : 27 Jun 2022 10:09 PM (IST) Tags: ANDHRA PRADESH jagan srikakulam news Dharmana Prasada Rao Amma Vodi CM Jagan Srikakulam Tour

సంబంధిత కథనాలు

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Ticket booking: ఐదు నిమిషాల ముందే రైలులో టికెట్ బుక్ చేస్కోవచ్చు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

Palnadu News : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్, రూ.5 లక్షలతో పరారీ

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

Breaking News Telugu Live Updates: యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?