అన్వేషించండి

Srikakulam Twin Villages : ఉద్దానంలో కవల గ్రామాలదో ప్రత్యేకత - అదేంటో తెలుసా ?

Srikakulam : కవల పిల్లల గురించి విని ఉంటాం.. ఒకే పోలికతో ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చదివాం. కానీ ఒకటి కాదు, రెండు కాదు.. వందల సంఖ్యలో గ్రామాలు ఒకే పోలికతో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం !

Srikakulam Kaval Villages : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని ఉద్దాన ప్రాంతంలో.. ఒకటి కాదు, రెండు కాదు.. మొత్తంగా నూట ఇరవైకి పైగా పచ్చని పల్లెటూర్లు ఒకే పోలికతో ఉంటాయి. అందుకే వీటిని కవల గ్రామాలు అని పిలుస్తారు. ఈ కవల గ్రామాలు ఇక్కడివారి మధ్య ఆప్యాయతను పంచుతూ ఉండగా..బయట ప్రాంతాల వారు ఇక్కడి వస్తే మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.

రెండో కోనసీమ ఉద్దానం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి. ఈ కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో నూట ఒక్క పంచాయితీలు ఉన్నాయి.. ఈ పంచాయితీల పరిధిలో ఇంకా వందలాది గ్రామాలు ఉన్నాయి.. ఉద్దాన ప్రాంతంలో భాగమైన ఈ నాలుగు మండలాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. రెండవ కోనసీమగా పిలిచే ఈ ఉద్దాన ప్రాంతంలో ఆప్యాయతలు, ఆత్మీయతలు కుడా అధికంగానే ఉంటాయి.. వ్యయసాయం ప్రధాన వృత్తిగా  జీవించే ఇక్కడి వారు.. తరతమ భేదాలు మరిచి.. అందరితో కలివిడిగా ఉంటారు.. ఏ గ్రామంలో చిన్న శుభకార్యం జరిగినా.. కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం అక్కడ కొలువుదీరుతారు.. ఆనందంగా గడుపుతారు.. సమస్యలు వస్తే సమిష్టిగా పనిచేసి సరిచేస్తారు.. అందుకే వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఉద్దానంలో కలహాలు, కొట్లాటలు అన్న పదమే అరుదుగా వినిపిస్తూ ఉంటుంది.

అనేక గ్రామాలకు పుట్టుగ పేరు 

ఇక ఈ ఉద్దాన ప్రాంతంలో ఇక్కడివారి ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఇక్కడి గ్రామాల పేర్లు.. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని నూట ఒక్క పంచాయితీలలో సుమారు మూడు వందల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు వందల పై చిలుకు గ్రామాలలో సగానికి పైగా గ్రామాలు ఒకే పోలికతో ఉంటాయి. ఏ ఊరిలో ఎక్కువ మంది ఒకే ఇంటి పేరుతో ఉంటారో.. అదే పేరుతో ఆ గ్రామం పేరు ముడిపడి ఉంటుంది. ఇంటి పేరు తరువాత పుట్టుగ అని చేర్చి అప్పట్లో ఈ గ్రామాలకు నామకరణం చెయ్యడం ప్రారంభించారు.. అదే సాంప్రదాయాన్ని స్థానికులు కొనసాగించడంతో ఇప్పుడు నూట ఎభైకి పైగా పుట్టుగలు ఉద్దాన ప్రాంతంలో వెలశాయి.. ఒక ఊరిలో గొండ్యాల ఇంటిపేరు తో ఎక్కువ మంది ఉంటె ఆ గ్రామం పేరు గొండ్యాల పుట్టుగ అని, బార్ల వారు ఎక్కువగా ఉంటె బార్ల పుట్టుగ, బొర్ర వారు ఎక్కువ ఉంటె బొర్ర పుట్టుగ అని.. గ్రామాల పేర్లు  ఉద్దాన ప్రాంతంలో దర్శనం ఇస్తాయి.. అయితే అన్ని గ్రామాలు యూనిఫాం గా ఉండాలన్న ఆలోచనతో అప్పట్లో  ఇంటిపేరుతో సంబంధం లేకుండా ఉండే గ్రామాలకు కూడా చివరన పుట్టుగ అని చేర్చి మొత్తంగా ఉద్దానంలో ఎక్కడ చూసినా పుట్టుగ అని కనిపించేలా వినూత్న ఆలోచనకు వందల ఏళ్ళ క్రితమే ఆలోచన చేస్తారు ఉద్దాన ప్రాంత పూర్వీకులు.. ఇప్పటికీ కొత్తగా ఏర్పడే కాలనీలకు ఇదేతరహా నామకరణాలు చెయ్యడం స్థానికులు అలవాటు చేసుకోవడంతో.. ప్రస్తుతానికి నూట ఎభైకి పైగా పుట్టుగలు ఈ ఉద్దాన ప్రాంతంలో పుట్టినట్లు తెలుస్తోంది.అయితే మొత్తంగా ఎన్ని పుట్టుగలు ఉంటాయి అన్నదానిపై ఇప్పటికీ స్పష్టమైన వివరాలు లేవు.. పంచాయితీల పరంగా ఒక అంచనా ఉన్నప్పటికీ.. పంచాయితీల పరిధిలో ఉండే చిన్న చిన్న గ్రామాల లెక్క అనేదానిపై స్పష్టత కొరవడింది. కొంతమంది పూర్వీకులు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ళ క్రితం ఈ ప్రాంతంలో మొత్తంగా అరవై నాలుగు పుట్టుగలు ఉండేవని.. అయితే.. కాలానుగుణంగా.. అనేక కొత్త గ్రామాలు, కాలనీలు ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన గ్రామాలకు సైతం ఇదే పుట్టుగ పేర్లు ఉండటం తో.. నూట ఎభైకి పైగానే ఉద్దాన ప్రాంతంలో కవల గ్రామాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.

కొత్త వారికి అయోమయం కల్పిస్తున్న గ్రామాలు

బెజ్జిపుట్టుగ, గొండ్యాల పుట్టుగ, ప్రగడ పుట్టుగ, రామయ్యపుట్టుగ, చండి పుట్టుగ, లండ పుట్టుగ, బొర్ర పుట్టుగ, జల్లు పుట్టుగ.. ఇలా ఉద్దాన ప్రాంతంలో ఉండే వందలాది పుట్టుగలు స్థానికుల మధ్య ఆప్యాయతలు పంచుతూ ఉండగా.. బయట ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారికి మాత్రం కావలసినంత కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తూ ఉంటాయి.. బయట ప్రాంతాల నుండి ఉద్దాన ప్రాంతానికి ఉద్యోగ రీత్యా, శుభకార్యాల కోసం వచ్చే వారు.. ఒక గ్రామం అడ్రస్ కు బదులు.. వేరే గ్రామానికి చేరుకోవడం.. అక్కడికి వెళ్ళిన తరువాత.. ఈ పుట్టుగల కన్ఫ్యూజన్ నడుమ.. అసలు గ్రామానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు.. బయట ప్రాంతాల వారికి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ కవల గ్రామాలు అప్పుడప్పుడు స్థానికులకు సైతం జలక్ లు ఇస్తూనే ఉంటాయి.. ఏమరపాటుగా అడ్రస్ నోట్ చేసుకుంటే.. ఇక్కడివారు సైతం అనేక సందర్భాల్లో ఈ కవల గ్రామాలతో ప్రయాస పడుతూనే ఉంటారు.        

 

టాప్ హెడ్ లైన్స్

Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Tragedy: వియత్నాంలో బోటు విషాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Indian Tourists Boat Capsized Vietnam: వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
వియత్నం మృతుల్లో కడప శ్రీధర్, మచిలీపట్నం జయశ్రీ - లావా మొబైల్స్ తెలుగు డీలర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం !
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు సహా 18 మంది మృతి!
Breaking News: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 18 మంది మృతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget