అన్వేషించండి

Yuvagalam Permission : లోకేష్ పాదయాత్రకు అనుమతి - రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పోలీసుల షరతు !

లోకేష్ పాదయాత్రకు చిత్తూరు జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని షరతు విధించారు.

Yuvagalam Permission :   27వ తేదీ నుంచి నారా లోకేష్ ప్రారంభించనున్న యువగళం పాదయాత్రకు పోలీసుల నుంచి ్నుమతి లభించింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ జరిగే పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లుగా చిత్తూరు ఎస్పీ ప్రకటించారు. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రలో ఎక్కడ  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని షరతు విధించారు. దీంతో పాదయాత్రకు అనుమతి లభిస్తుందా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది. 27 వ తేదీన కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం  అవుతుంది.

ఈ నెల‌ 27నుంచి రాష్ట్రంలో టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  పాదయాత్ర ప్రారంభం కానుంది...40 రోజుల క్రితమే లోకేష్ పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి..రాష్ట్రలో ఉన్న వివిధ వర్గాల ప్రజల‌ సమస్యలను ఫోకస్ చేస్తూ పాదయాత్ర  సాగనుందని తెలిపారు..పాదయాత్రకు యువగళం అన్న పేరును ఖరారు చేశారు. 400 రోజులు 4వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది.  జనవరి 27న కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యువగళం పాదయాత్ర ఇచ్చాపురంలో పూర్తి ఆవుతోంది. పాదయాత్ర తేదీ దగ్గర పడటంతో నాయకులు క్యాడర్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.  

పాదయాత్ర  కు అనుమతి కావాలంటూ పోలిట్ బ్యూరో సబ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న  ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి  లేఖ రాశారు.   స్పందించక పోవడంతో రెండు సార్లు రిమైండర్ కూడా పంపారు. 21 వ తేదిన డీజీపీ స్పందిస్తూ ప్రత్యుత్తరం పంపారు  . 400 రోజుల‌పాటు లోకేష్ చేపట్టనున్న యువగళం పాదయాత్రకు సంబధించి‌ డీజీపీ అడిగిన వివరాలు ... నాలుగు  వందల‌ రోజులకు సంబంధించి  ప్రతి రోజు ఎవరెవరు పాదయాత్రలో‌ పాల్గొంటారు..?  లోకేష్ ను కలుసుకునే వ్యక్తుల వివరాలు వారి ఆథార్ కార్డు తో సహా సమర్పించాలి అని లేఖలో‌ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‌పాదయాత్రలో  ఉండే వాహన కాన్వాయ్ వివరాలు... వాహనాల‌ రిజిస్ట్రేషన్ నెంబర్లు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ తో సహ వివరాలు...రూట్ మ్యాప్ ఏ బజారు నుంచి ప్రారంభమై ఎక్కడ ఆ రోజు ముగుస్తోందో 400 రోజలకు సంబంధించిన  వివరాలు... ఏ సమయంలో ఏ ప్రాంతంలో యాత్ర సాగుతోందో తేదీల‌ వారిగా వివరాలు... ప్రతి రోజు బస చేసే ప్రాంతం ..ఎక్కడ నైట్ స్టే అవుతారో తెలియచేస్తూ స్థానికంగా ఆ బాధ్యతలు చూసే వారి ఫోన్ నెంబర్లు అందచేయాలని లేఖలో  ప్రస్తావించారు.  

ఈ వివరాలన్నీ ఇవ్వడం సాధ్యం కాదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా.. పాదయాత్ర జరిగి తీరుతుందని.. తమది ప్రజాస్వామ్య హక్కు అంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి.. అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పడంతో  టీడీపీ శ్రేణులు ఇక అడ్డుకోరన్న ఉద్దేశంతో ఉన్నాయి.  పాదయాత్రను భారీ ఎత్తున విజయవంతం చేసుకోవడానికి లోకేష్ చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నారు.  కొన్ని వేల మంది ని నేరుగా కలిసి మద్దతు అడిగారు. ఆయనతో పాటు నడిచేందుకు కార్యకర్తలు కూడా సిద్ధమయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget